బడంగ్ పేటలో ఘనంగా ఫన్ మాక్స్ కిడ్స్ ప్లే జోన్ మరియు మినీ థియేటర్ ను ప్రారంభించారు

మహేశ్వరం;6 జూన్ 2025 (శుక్రవారం) తెలంగాణ వార్త రిపోర్టర్:-మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని బడంగ్ పేట్ లో ఉద్యోగ్ నగర్ కాలనీ, హెచ్.పి. పెట్రోల్ పంప్ దగ్గరలో ఫన్ మ్యాక్స్ కిడ్స్ ప్లే జోన్ & పార్టీ థియేటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి. ఈ సందర్భంగా యజమాని గణేష్ మాట్లాడుతూ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇండోర్ కిడ్స్ ప్లే ఏరియాను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. గంటకి ఒకరికి(2 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల చిన్నపిల్లలకు) 250/- రూపాయలు కానీ ఓపెనింగ్ ఆఫర్ కింద గంటకి ఒకరికి 200/- రూపాయలు మాత్రమే వారం రోజుల వరకు వసూలు చేస్తామని అన్నారు. అలాగే పార్టీస్ కొరకు థియేటర్ కూడా అందుబాటులో ఉందని, అతి తక్కువ ధరలోనే పరిసర ప్రాంత ప్రజలందరికీ అందుబాటులో ఉంచామని యజమాని పేర్కొన్నారు. పిల్లలు ఉత్సాహంగా, ఉల్లాసంగా తమ సమయాన్ని గడపాలని తల్లిదండ్రులని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, నాయకులు బద్దం రాము గౌడ్, గిరి ముదిరాజ్, కావలి చంద్రయ్య, స్నేహితులు, బంధువులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.