బలరామునిగా భక్తులకు దర్శనం ఇచ్చిన భద్రాద్రి రాముడు
తెలంగాణ వార్త డిసెంబర్ 27 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం : వైకుంఠ ఏకాదశి, దశావతార మహోత్సవాల సందర్భంగా దివ్య క్షేత్రం భద్రాచలంలో శనివారం శ్రీ సీతారామచంద్ర స్వామి వారు బలరామావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. వ్యవసాయదారులకు ప్రీతికరమైన బలరామ స్వామి వారిని దర్శించిన భక్తులు, రైతు సోదరులు జైశ్రీరామ జై జై రైతు బాంధవబలరామ అంటూ స్వామివారికి జేజేలు పలికారు. ఆదివారం స్వామివారు కృష్ణ పరమాత్మగా దర్శనం ఇస్తారు.