ఎన్నికైన సర్పంచులకు హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ చామల
అడ్డగూడూరు 27 డిసెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ ఎన్నికలలో విజయం సాధించిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రజా సంక్షేమం పరదర్శంక పాలనలో మీరు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్ష కోరుతూ.. మీ నాయకత్వంలో గ్రామపంచాయతీ సర్వతో ముఖాభివృద్ధి సాధించాలని కోరుకుంటున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీ పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటూ మీకు గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో, పిల్లాపాపలతో, పాడిపంటలతో,అన్ని రకాల విజయాలతో 2026 సంవత్సరంలో అడుగులు వేయాలని శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసిన లోక్ సభ సభ్యులు,భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.