భారతమాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారిని కలిసిన భక్త రామదాసు గారి వారసులు

Dec 27, 2025 - 18:14
 0  3
భారతమాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారిని కలిసిన భక్త రామదాసు గారి వారసులు
భారతమాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారిని కలిసిన భక్త రామదాసు గారి వారసులు

తెలంగాణ వార్త డిసెంబర్ 27 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం : దివ్య క్షేత్రం భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి, దశావతార మహోత్సవాలు జరుగుతున్న సందర్భంగా, ప్రముఖ వాగ్గేయకారుడు భద్రాచలం రామాలయం నిర్మాత భక్త రామదాసు గారి 11వ తరం వారసులు శ్రీ కంచర్ల వెంకటరమణ శనివారం భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల గురించి వారికి తెలియజేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లు వెంకయ్య నాయుడు గారి నివాసంలో కలసిన కంచర్ల వెంకటరమణ స్వామివారి ప్రసాదం, అక్షింతలు భారత మాజీ ఉపరాష్ట్రపతి గారికి అందించి సాలువాతు సత్కరించారు. రామాలయ క్షేత్ర మహత్యం పుస్తకాన్ని శ్రీ వెంకయ్య నాయుడు గారికి అందజేశారు. ఈ మధ్య జరుగుతున్న రామాలయ వివాదం గురించి పెద్దలు వెంకయ్య నాయుడు గారి దృష్టికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. 

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333