ప్రజా దర్బార్ క్యాలెండర్ ఆవిష్కరించిన డిపిఆర్ఓ

జోగులాంబ గద్వాల 22 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల్. జిల్లా కేంద్రంలోని డిపిఆర్ఓ ఆఫీస్ నందు ప్రజా దర్బార్ దినపత్రిక 2025 సంవత్సరం నూతన క్యాలెండర్ను జోగులాంబ గద్వాల జిల్లా డిపిఆర్ఓ ఆరీఫుద్దీన్ బుధవారం ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలికి తీసి ప్రభుత్వానికి పంపే విధంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా దర్బార్ విలేఖరులు లవకుశ అలియాస్ శివ, అలంపూర్ రిపోర్టర్ బాబా, జర్నలిస్టులు ముకుందరావు, జాన్, మన్నాపురంరాముడు, బలరాం, కృష్ణ, రాముడు సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.