బస్సు పాస్ కౌంటర్ ఏర్పాటు చేయాలి - ఏబీవీపీ

జోగులాంబ గద్వాల 29 జూన్ 2024 తెలంగాణ ప్రతినిధి:- కేంద్రం లో ఏబీవీపీ గద్వాల్ జిల్లా కన్వీనర్ సురేష్ మాట్లాడుతూ ... అయిజ నుండి వివిధ గ్రామాల నుండి వచ్చే విద్యార్థులు చదువుకోవడానికి అయిజ కు వస్తున్నారు అయితే బస్సు పాస్ తీసుకోవాలంటే పాఠశాల, కళాశాలలకు సెలవు పెట్టి గద్వాల్ కు వచ్చి పాస్ తీసుకొవాలి దీనివలన విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది అందువలన అయిజ లో ఉన్న బస్టాండ్ లోనే బస్సు పాస్ కౌంటర్ ఏర్పాటు చేయాలనీ కోరడమైనది అంతేకాకుండా విద్యార్థులకు సరైన సమయం లో బస్సులు నడిపే విధంగా చూడాలని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని గద్వాల్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఆర్ మంజుల కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది .ఈ కార్యక్రమం లో వెంకటేష్, నరేష్, పవన్ పాల్గొన్నారు.