పురుషోతమగూడెం బ్రిడ్జి దగ్గర కంకర తేలిన రోడ్డును తాత్కాలికముగా బిటి రోడ్ వేసి పూర్తి చేయాలి!

మరిపెడ 30 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- గత వర్ష కాలమున ఆకేరు వాగు వంతెన తెగి రోడ్డు ధ్వంసం అయిన విషయం అందరికీ తెలిసిన విషయమే, సదరు డిపార్ట్మెంట్ వారు తాత్కాలికముగా మొరం పోసి కనక వేసి రోడ్ ను వేయడం జరిగింది, ఇప్పుడు ఆ రోడ్డు కుంగి పోయి కంకర తేలి ప్రమాదాలకు నెలవుగా మారినది అని లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త జాదవ్ రమేష్ నాయక్ తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం ఇప్పటి వరకు ఈ రోడ్ మీద దరిదాపు 16 వరకు కారులు ప్రమాదాలకు గురి అయినాయి అని తెలిసిన సదరు విభాగం వారు చలించకపోవడం దారుణం.త్వరితగతిన తాత్కాలికముగా బ్లాక్ టాప్ రోడ్ వేయాలని లంబాడీల ఐక్య వేదిక డిమాండ్ చేస్తున్నాము.లేని యడల త్వరలో రోడ్ మీద దీక్ష చేస్తాము అని అవసరం అయితే రాస్తా రోకో నిర్వహిస్తాము అని తెలిపారు.అలాగే ఇప్పటి వరకు ఇక్కడ ఎన్ని కార్లు ధ్వంసం అయ్యాయో, ఎన్ని ప్రమాదాలు అయ్యాయో వాటికి బాధ్యత వహించి వారికి సదరు విభాగం వారు నష్ట పరిహారం అందించాలి అని డిమాండ్ చేసారు.