నేడే బొగ్గు గనుల వేలం:దేశవ్యాప్తంగా 60 గనుల గుర్తింపు

Jun 21, 2024 - 19:40
 0  1
నేడే బొగ్గు గనుల వేలం:దేశవ్యాప్తంగా 60 గనుల గుర్తింపు

వేలంలో పాల్గొననున్న సింగరేణి యాజమాన్యం

హైదరాబాద్‌:జూన్ 21: శుక్రవారం హైదరాబాద్‌లో బొగ్గు గనుల వేలం నిర్వహించనున్నారు. ప్రతి ఏటా ఏదో ఒక నగరంలో బొగ్గు బ్లాకుల వేలాన్ని నిర్వహిస్తారు. 

మన రాష్ట్రానికి చెందిన కిషన్‌రెడ్డి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా ఉండటంతో 10వ రౌండ్‌ కమర్షియల్‌ మైనింగ్‌ వేలాన్ని ఆయన నేడు హైదరాబాద్‌లో ప్రారం భించనున్నారు. 

దేశవ్యాప్తంగా 60 బొగ్గు బ్లాక్‌లను వేలం వేయను న్నారు. ఇందులో వివిధ రకాల కోకింగ్‌, నాన్‌-కోకింగ్‌ బొగ్గు గనులున్నాయి. వీటిలో 24 బొగ్గు గనులను పూర్తిగా అన్వేషించగా, 36 గనుల్లో పాక్షిక అన్వేషణ జరిగింది. 

రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా ఒడిశా 16, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ల లో15, జార్ఖండ్‌లో 6, పశ్చిమబెంగాల్‌, బీహార్‌ల లో మూడేసి బొగ్గు బ్లాకులను గుర్తించారు. 

తెలంగాణ, మహారాష్ట్రలో ఒక బ్లాక్‌లను వేలం వేయనున్నారు. బొగ్గు రంగంలో పారదర్శకత, పోటీతత్వం సుస్థిరతను పెంపొందించడానికి దోహదపడుతుందని అధికార బీజేపీ అంటోంది. 

వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా ఉన్న ఈ బ్లాక్‌లు ప్రాంతీయ ఆర్థికా భివద్ధికి, ఉపాధి కల్పనకు దోహదం చేస్తాయని వాది స్తోంది. అయితే ఈ వాదన ను రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్‌ మొదలగు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. 

కేంద్రం కార్పొరేట్లకు దేశ సంపదను దోచి పెట్టేందుకే వేలం అని విమర్శిస్తున్నా యి. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం వేలంలో పాల్గొనేందుకు నిర్ణయిం చింది. 

బిడ్‌లో పాల్గొనకపోతే  సింగరేణి కనుమరుగవు తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నది. గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ వేలానికి మద్దతు పలికిందని ఈ సందర్భంగా తెలుస్తుంది...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333