పంచాయతీ కార్మికుల జీతాలు తక్షణమే విడుదల చేయాలి
బహుజన వర్గాల ప్రజలు నిర్వహిస్తున్నారని పర్మినెంట్ చేయడం లేదా?
ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న పాలకులకు బహుజన ప్రజలు,ఉద్యోగులు ప్రజల క్రిందకు రారా?
గత ప్రభుత్వం చేసిన మోసమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చర్ల మండలాన్ని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
చల్ల గుండ్ల సతీష్ చౌదరి బిఎస్పీ చర్ల మండలం అధ్యక్షులు.
చర్ల మండలంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయం నందు పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ మండల ఇన్చార్జ్ సామల ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో పార్టీ జిల్లా ఇన్చార్జి తడికల శివకుమార్ గారు పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు కొండ చరణ్ గారు నియోజకవర్గ కోశాధికారి కొప్పుల నారాయణ గార్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్టీ చర్ల మండల అధ్యక్షులు చల్లగుండ్ల సతీష్ చౌదరి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు ఎన్నికల సందర్భంగా గెలవడం కోసం అనేక హామీలను ఇచ్చి ప్రజలని నమ్మించి అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని ఇప్పటివరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు హామీలు నెరవేర్చక పోవడం వల్ల బిఆర్ఎస్ ప్రభుత్వనికి ప్రజా ప్రభుత్వామని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద తేడా లేకుండా పోతుందని అన్నారు పంచాయితీ కార్మికులకు,మల్టీ పర్పస్ వర్కర్లకు తక్షణమే జీతాలు చెల్లించాలని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాన్ని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్ చార్జ్ తడికల శివకుమార్ డిమాండ్ చేశారు, చర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో భాగంగా ఈ వ్యాక్యలు చేశారు.మల్టీ పర్పస్ వర్కలను పర్మినెంట్ చేస్తామని,జీతాలు పెంచుతామని హామీ ఇచ్చి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ఆద్వర్యంలోని తెలంగాణా ప్రభుత్వం ఏడాది గడుస్తున్నా ఆ హామీల ఊసెత్తకుండా ఉండడమే కాకుండా ...గత మూడు నెలలుగా జీతాలు కూడా చెల్లించడం లేదని దుయ్యబట్టారు.భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 22(1) ప్రకారం కాంట్రాక్ట్ ,ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కల్పన నేరమని తక్షణమే మల్టిపర్పస్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు చర్ల మండలానికి కూడా ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారని అవి కూడా ఏమాత్రం నిర్వహించలేదని మండిపడ్డారు ఆర్ఎంపీలకు ప్రభుత్వ గుర్తింపు ఇస్తానని చెప్పారని డిగ్రీ కాలేజ్ నిర్మిస్తానని ఐటిఐ కాలేజ్ ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చి మరిచారని విమర్శించారు తక్షణమే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు లేకపోతే పెద్ద ఎత్తన ప్రజా ఉద్యమం నిర్మించి ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేఖ విధానాలను ఎండగడతామని హెచ్చరించారు