నా గర్భ శోకానికి ఇకనైనా పులిస్టాప్ పెట్టరా పులిస్టాప్ పెట్టరా? మల్లయ్య గట్టు
ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి:- నా గర్భశోకానికి ఇకనైనా పుల్ స్టాప్ పెట్టరా?
అక్రమార్కులు అడ్డంగా దోచుకోవటానికి నేనే దొరికానా?
ప్రకృతి రమణీయతను సంతరించుకున్న నేను ఈ గర్భసోకానికి ఎందుకు గురవ్వాలి?
పచ్చని చెట్లతో అందంగా ఉన్న నేను ఇలా ఎందుకు అంధవికారంగా కావాలి?
జగ్గయ్యపేట సన్ఫ్లవర్ న్యూస్ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వారు ఆర్థికంగా పక్కదారిలో సంపాదించాలంటే నేనే దొరికాను. అధికారంలో ఎవరు ఉండినా నాకు గర్భశోకాన్ని కలిగిస్తుంటే ప్రతిపక్షం మాత్రం ఏవో తూతు మంత్రంగా విమర్శలు చేస్తూ ఉంటది. కానీ అది మరలా వారే అధికారంలోకి వస్తే చేసేది అదే. ఒకరి కాలంలో అవినీతి అయితే మరొకరి కాలంలో నీతి అంటారు ఆ పెద్ద మనుషులు. ఎందుకు నాకు ఈ వ్యద,ఈ చిత్రహింసలు. పచ్చని చెట్లతో రమణీయతను కలిగి ఆహ్లాదాన్ని కలిగిస్తూ నా నెత్తిన ఆధ్యాత్మికంగా విరాజిల్లుతున్న కొంగర మల్లయ్య స్వామి క్షేత్రం. సాంకేతిక సేవలు అందించటానికి టవర్ ఏర్పాటు చేశారు. పచ్చని చెట్ల మధ్య ఉన్న నాకు ఇలా కడుపుకోత కోస్తున్నారు. ఎంతోమంది మేధావులు విమర్శిస్తున్న వారు పెడచెవిన పెడుతున్నారు. నేను ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు ఒక గుర్తింపు కలిగి ఉన్నాను.కొంగర మల్లయ్య గట్టు అంటే ఈ ప్రాంతంలో ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కలిగి ఉండి విరాజిల్లుతున్నాను. ఆధ్యాత్మిక దేవాలయంగా ఉన్నటువంటి ప్రకృతి రమణీయతను కలిగి ఉన్న నన్ను అందిన కాడికి దోచుకోవాలని అక్రమార్కులు నా గర్భశోకాన్ని ఇలా కలిగిస్తున్నారు. ఇప్పటికైనా మేధావులు, సామాజిక కార్యకర్తలు, పర్యావరణ పరిరక్షణ ప్రేమికులు నన్ను కాపాడి భావి భారత సమాజానికి నేనొక చిరస్మరణీయంగా ఉండే విధంగా చేస్తారని కోరుకుంటున్న కొంగర మల్లయ్య గట్టు. ఇటీవల నందిగామకు ఒక సమర్థ నీయమైనటువంటి ఆర్డిఓ రావటం జరిగింది.వారి పాలనలోనైనా నా గుండె కోతను ఆపుతారేమోనని కొంతమంది పర్యావరణ ప్రేమికుల ద్వారా అయినా ఇది ఆ ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్తారని ఘోషిస్తున్నాను. ఇకనైనా నా గోడుని, నా గోషను ఆపుతారని మరొక్కసారి అందరినీ కోరుతున్నాను.