తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనలో సంవత్సరం
పూర్తయిన సందర్భంగా సీఎం కప్ మండల స్థాయి క్రీడా ముగింపు
కార్యక్రమాలకు హాజరైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాస్టర్ షేక్షావలి ఆచారి మరియు 19 వార్డ్ కౌన్సిలర్ , 15వ వార్డు కౌన్సిలర్ రాణమ్మ
జోగులాంబ గద్వాల 12 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఐజ. మండల కేంద్రంలోని మండల స్థాయి సీఎం కప్ క్రీడాల ముగింపు కార్యక్రమం ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ నందు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం నిర్వాహకులు ఎంఈఓ ఎంపీడీవో ఎమ్మార్వో దాదాపు మూడు రోజులపాటు 12 గ్రామాల విద్యార్థిని విద్యార్థుల తో ఈ క్రీడలు నిర్వహించి మండల స్థాయి సెలక్షను నిర్వహించడం జరిగింది. దాదాపు 100 మంది విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ సెలెక్ట్ అయి గద్వాలలో 16వ తారీకు నుండి జరగబోయే జిల్లా స్థాయి క్రీడల్లో పాల్గొంటారని ఎమ్మార్వో ఎంఈఓ ఎంపీడీవో తెలియజేయడం జరిగింది .ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో గ్రామస్థాయిలో నిర్వహించి మట్టిలో మాణిక్యాల లాంటి క్రీడాకారులను పైకి తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం పని చేయడం చాలా సంతోషంగా ఉందంటూ అధికారులు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాట్లాడుతూ..... నేను ఒక నేషనల్ క్రీడాకారుడిగా మరియు అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న అనుభవంతో ఇటువంటి క్రీడలను ప్రభుత్వం ఎంకరేజ్ చేయడం వల్ల మారుమూల గ్రామాల నుండి అంతర్జాతీయ స్థాయిలో పోటీ చేసే అర్హతను పొందడానికి ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని కల్పించింది అంటూ ఇటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పానాలను మరెన్నో కార్యక్రమాలు తీసుకొస్తూ ప్రజల్ని విద్యార్థుల భవిష్యత్తుని మంచి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు పోతుందని అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ముగ్గురు అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ మరోసారి ఇటువంటి క్రీడలు నిర్వహిస్తే ఏ కార్యక్రమానికైనా తన వంతు సహాయాన్ని ప్రభుత్వం తరఫున నా తరపున అందిస్తానని అధికారులకు విన్నవించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి మండల కేంద్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ల వీటిలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది