రెండోసారి కూడా పార్టీలో కొనసాగుతున్న వనం ఉపేందర్
చౌటుప్పల్ 18 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- సీపీఎం జిల్లా కమిటీ సభ్యలుగా వనం ఉపేందర్ రెండో సారి ఎన్నిక చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో జరిగిన యాదాద్రి భువనగిరి జిల్లా సీపీఎం 3వ మహాసభలలో రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన వనం ఉపేందర్ ని రెండోసారి జిల్లా కమిటీగా ఎన్నుకోవడం జరిగింది. ఈసందర్బంగా మాట్లాడుతూ ఉపేందర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారెంటీలను ప్రకటించినా ఇప్పటికి అమలు చేయడంలేదు.వికలాంగులకు 6000 పింఛన్ ఉచిత బస్ పాస్ సౌకర్యంవికులాంగ నిరుద్యోగులకు బ్యాక్ లాగ్ పోస్టులను బర్తీ చేస్తామని,ప్రజలకు విద్య, వైద్యం,ఉద్యోగ చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయాలని అన్నారు.భవిష్యత్తులో బలమైన ప్రజా ఉద్యమాలను నిర్వహించడం కోసం కృషి చేస్తామని అదేవిధంగా యాదాద్రి జిల్లా వ్యాప్తంగా పేరుకుపోయిన సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో అనేక పోరాటాలను నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. బాల్యం నుంచి ప్రజా సంఘాలు ఎస్ఎఫ్ఐ,డివైఎఫ్ఐ, సీఐటీయూ,వికలాంగుల సంఘాలలో పనిచేస్తూ మంచి కార్యకర్తగా ప్రజలలో మధ్య ఉండి పార్టీ పిలుపు మేరకు ప్రజాపోరాటాలు పాల్గొంటున్నట్టు తెలిపారు. మల్లీ రొండోసారి జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర, జిల్లా కమిటీకి అభినందనలు తెలిపారు.