మధ్యాహ్న భోజనం నాణ్యతగా వండాలి

కేటి దొడ్డి ఎంఈఓ వెంకటేశ్వరరావు

Dec 12, 2024 - 19:04
Dec 12, 2024 - 19:05
 0  11

జోగులాంబ గద్వాల 12 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- కేటి దొడ్డి. మండలం పరిధిలోని మధ్యాహ్నం భోజనం నాణ్యతగా వండి విద్యార్థినులకు అందజేయాలని కేటీ దొడ్డి ఎంఈఓ వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం కేటీ దొడ్డి మండలంలో కేజీబీవీ పాఠశాల ఎంపీహెచ్ఎస్ స్కూల్లో,  ఉమిత్యాల, తండాలలో ప్రాథమిక పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేజీబీవీ పాఠశాలలో వంటగది, మరుగుదొడ్లు, హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వంట ఏజెన్సీ వారికి గ్లౌసులు, టోపీలు, మాస్కులు ఎంఈఓ తన సొంత ఖర్చులతో ఖరీదు చేసి వారికి అందజేశారు. అలాగే అప్రాన్స్ ను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి ఆధ్వర్యంలో త్వరలో  అందజేయనున్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతగా వండి పేట్టాలని వంట ఏజెన్సీ వారిని ఆదేశించారు. విద్యార్థుల డైనింగ్ హాల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. అలాగే ఉమిత్యల, తాండ లో ఎంపీహెచ్ఎస్, సిపిఎస్ స్కూల్ లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలలో హెడ్మాస్టర్లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333