అన్నమో రామచంద్ర.. అన్నం పరబ్రహ్మ స్వరూపం?
శాలిగౌరారం 26 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-అందరికీ నమస్కారములు ఈ యొక్క మెసేజ్ ని పూర్తిగా చదవండి పాటించండి10రు" లేక 20రు"ల సొంత డబ్బులతో పానీపూరీ కొనుక్కొని తింటే, ప్లేట్‌లోని నీళ్ళను కూడా వదలకుండా తాగుతారు....!అలాగే 10రు"తో 'ఐస్‌క్రీం' కొంటే చివరికి మూతకు ఉన్నది కూడా నాకుతారు...! తింటాం!అలాంటిది మనము పెళ్ళి విందులకు,జన్మదిన వేడుకలకు ఇతర వేడుకలకు,అన్నదానాల వద్దకు వెళ్ళిన తర్వాత,అక్కడ మాత్రమే ఆహారాన్ని ఎందుకు ఇంతగా వృధా చేస్తారు?దాని వల్ల మన హోదా ఏమైనా పెరుగుతుందా ? ఒక్కొక్క ధాన్యపు గింజ ఆహారం గా మారడానికి, అది మన కడుపులోకి రావడానికి రైతుల శ్రమ, డబ్బు, కూలీల చెమట చుక్కలు ఉన్నాయనేది మనం మరవ కూడదు. మన కుటుంబాలలోనే మన తండ్రి, తల్లి తమ జీవితమంతా ఆ ఆహారం కోసం కష్టపడి ఉండవచ్చును. ప్రపంచంలో అన్నిటి కంటే పెద్ద బాధ "ఆకలిబాధ" ప్రతి సంవత్సరం కోట్లాదిమంది ఆహారం లేక ఆకలి చావులకు గురి అవుతున్నారు. కడుపుకి ఎంత కావాలో అంతే పెట్టించుకోవాలి... మెతుకు కూడా వృధా కాకుండా పూర్తిగా తినాలి...! అలా ఆకలిని తీర్చుకోవాలి. కానీ, ఆహారం వృధా చేసి, ఇతరుల నోటి ముద్దను దూరం చేయకూడదు. ఇంట్లో అయినా, బయట అయినా, ఆహారాన్ని వృధా చేయడం మహా పాపం. దయచేసి తినే ఆహారాన్ని మాత్రం వృధా చేయొద్దని..కష్టపడి శ్రమించి ధాన్యాన్ని పండించే రైతులు ఆ ఆహారాన్ని చూసి గోడు విలపిచ్చుకున్నారు. రైతే రాజు అన్న సామెతకి అర్థం లేకుండా ఉందని అన్నారు.