నూతన ఎసై, ఎంపీడీఓ లను సన్మానించిన బిజెపి నాయకులు
చిన్నంబావి మండలం25నవంబర్ 2025తెలంగాణ వార్త : నాగర్ కర్నూలు జిల్లా జనరల్ సెక్రెటరీ జగ్గారి శ్రీధర్ రెడ్డి,చిన్నంబావి మండల బిజెపి అధ్యక్షులు బొగ్గు కురుమయ్య,బిజెపి మండల ప్రధాన కార్యదర్శి సంపత్,బిజెపి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు కత్తి జానీ,చిన్నంబావి మండల బిజెపి పార్టీ మండ అధ్యక్షుడు బొగ్గు కురుమయ్య ఆధ్వర్యంలో చిన్నంబావి మండలానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మరియు ఎంపీడీవో ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి జగ్గారి శ్రీధర్ రెడ్డి, చిన్నంబావి మండల ప్రధాన కార్యదర్శి సంపత్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కత్తి జానీ, మండల నాయకులు గోపి నాయుడు, మేకల చెన్నయ్య యాదవ్, జింకల కిరణ్ కుమార్, శివశంకర్, డిఎన్ రాము, వెంకటయ్య, విష్ణు, మరియు వివిధ గ్రామాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.