శ్రీశైలం భూ నిర్వాసితుల నాలుగు దశాబ్దాల98 జీవో అమలు ఎప్పుడొస్తుంది
చిన్నంబావి మండలం25నవంబర్ 2025తెలంగాణ వార్త : భూమి కన్న తల్లి ఆమెతో ఉన్న అనుబంధాన్ని ఎవరు మర్చిపోతారు.ప్రజా ప్రయోజనం కోసం బలవంతంగా భూములు తీసుకున్నా.ఇచ్చిన హామీలు నేటి వరకు నెరవేరకపోవడం తో శ్రీశైలం ప్రాజెక్టు భూ నిర్వాసితుల హృదయం ఇంకా రక్తమడుస్తూనే ఉంది. కొల్లాపూర్ చిన్నంబావి అల్లంపూర్ తాలూకాలలోని గ్రామాలు 1980లో నీటి ముంపుకు గురై వేలాది కుటుంబాలు తమ జీవనాధారాన్ని కోల్పోయాయి.నాటి నుండి నేటివరకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందో నష్ట పరిహారం ఎప్పుడు అందుతుందో అనే ప్రశ్న నిర్వాసితుల గుండెల్లో మిగిలిన ముద్రగానే ఉంది. ఇప్పటికీ 98 జీవో అమలు కాకపోవడం పై ఈ రోజు ప్రజా దర్బార్ లో మాట్లాడిన బాధితుడు పెబ్బేటి నారాయణ రెడ్డి, డా,నాగోజీ రావు మాట్లాడుతూ భూమి కన్నతల్లిఅనుకుంటాం.ఆమెను వదిలి మరొక చోటికి వెళ్ళడమంటే ప్రాణం విడిచేంత కష్టం ప్రజల కోసం అని మా భూములు తీసుకున్నారు.ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని అప్పటి సీఎం ఎన్టీ రామారావు 98 జీవో జారీ చేశారు.కానీ మాట మాటగానే మిగిలిపోయింది. 40 ఏళ్లైనా ఉద్యోగం నెరవేరలేదు.ప్రభుత్వం పై విశ్వాసం కోల్పోయే పరిస్థితి వచ్చింది అని వేదన వ్యక్తం చేశారు.ప్రజా భవన్‌ను ఆశ్రయించిన నిర్వాసితుల ర్యాలీ ఏళ్ల తరబడి ఎదురుచూపులు విసిగించడంతో నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాల 98 జీవో నిర్వాసితులు హైదరాబాద్ ప్రజా భవన్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.వారి డిమాండ్ ఒక్కటే మన బాధను నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కి వినిపించాలి.జటప్రోల్ బహిరంగ సభలో ముఖ్య మంత్రి ఇచ్చిన మాటకు నిలబడతారన్న కొత్త ఆశతో నిర్వాసితులు ఇక్కడకు చేరుకున్నారు.పక్క రాష్ట్రంలో న్యాయం ఇక్కడ ఎందుకు అన్యాయం2011లో ఆంధ్రప్రదేశ్‌లో నందికొట్కూరు తాలూకా శ్రీశైలం ముంపు బాధితులకు 984 ప్రభుత్వ ఉద్యోగాలు కేటాయించగా తెలంగాణ నిర్వాసితులకు అలాంటి అవకాశం ఇప్పటికీ రాలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 674 ఉద్యోగాల జీవో జారీ చేయడం బాధితుల ప్రశ్నలను మరింత పదు నెక్కించింది.పక్క రాష్ట్రంలో న్యాయం జరుగుతుంటే మాకు మాత్రం దూరమవడం ఎందుకు మా భూములే ఎక్కువ నీటి ముంపులో పోయాయి.నష్ట పరిహారం మాత్రం మాటల్లోనే నిలిచిపోయింది అని నిర్వాసితుల ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు నాయకత్వం పై ఆశలుఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకే చెందిన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,హామీఇవ్వడంతోకొల్లాపూర్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, పర్యవేక్షణపై నిర్వాసితులు పూర్తి నమ్మకం ఉంచుతున్నారు.ఈసారి అయినా మా న్యాయ హక్కు నెరవేరాలి. ఉద్యోగాలు వెంటనే అమలు చేయాలి.నిర్వాసితుల ఒకే డిమాండ్ 98.జీవోను సత్వరమే అమలు చేసిశ్రీశైలం నిర్వాసితుల ప్రతి కుటుంబానికి హామీ చేసిన ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి.నాలుగు దశాబ్దాలుగా సాగుతున్న ఈ నిరీక్షణకు ముగింపు పలకాలని ఐఏఎస్ నోడల్ ఆఫీసర్ దివ్య మేడంను కలిసి వినతిపత్రం అందజేస్తూ వేదన వ్యక్తం చేశారు.