ప్రజా పాలన మైనార్టీ కార్పొరేషన్ ముస్లిం సోదరి మహిళలకు కుట్టు మిషన్ పంపిణీ

Nov 25, 2025 - 19:00
 0  1

 అలంపూర్ నియోజకవర్గ ముస్లిం సోదరీమణులకు కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అలంపూర్ మాజీ శాసనసభ్యులు ఏఐసిసి కార్యదర్శి డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ ..!

 ముఖ్య అతిధులుగా హాజరైన మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ 

 జోగులాంబ గద్వాల 25 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  వడ్డేపల్లి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గంలో ఉన్న నిరుపేదలందరూ ప్రజాపాలన రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిరుపేదలందరికి న్యాయం చేస్తుంది చేసేదాకా నిద్రపోదు అసత్యాలను నమ్మకండి అసత్యాలతో పునాదులు వేసుకున్న బిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెబితేనే ఈరోజు మనమందరం నియోజకవర్గ పేద ప్రజలకు కూడా అందే వాటిలో కోతలు విధించాలని వాటిని కూడా ఆపాలన్న దురుద్దేశంతో అసత్యాలను నమ్మకూడదని తెలియజేశారు. నిరుపేదలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అభివృద్ధి సంక్షేమాలు 200 యూనిట్లు ఉచిత కరెంట్ అయితేనేమి, ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, ఉచిత గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే పనిలో కూడా నిమగ్నమై ప్రభుత్వాన్ని నడుపుతున్న తరుణంలో ప్రభుత్వానికి సహకరించడం మరిచిపోయి అసత్యాలను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు.

జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లి మండలంలోని శాంతినగర్ మున్సిపాలిటీ పరిధిలోని భవాని ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటుచేసిన తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ నుండి విడుదలైన కుట్టు మిషన్లను ముస్లిం సోదరీమణులకు పంపిణీ చేయడం జరిగినది. 

ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల కోత్వాల్ మాట్లాడుతూ 
మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి నిరుపేదలకు ఆర్థిక సాయం అందుతూనే ఉంటుందని అట్టి కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ముస్లిం మనులు ఇంట్లో ఉంటారు కాబట్టి వారికి కూడా జీవనోపాధి కల్పించే దిశగా ఆలోచించి కుట్టుమిషన్లు పంపిణీ కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకమంటూ అల్లంపూర్ నియోజకవర్గం ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుపేదలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధాలను నమ్మకండి అంటూ తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో అలంపూర్ మాజీ శాసనసభ్యులు ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్.ఎస్.ఎ.సంపత్ కుమార్ గారు  తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల  కోత్వాల్, తెలంగాణ రాష్ట్ర వాక్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్, తెలంగాణ రాష్ట్ర టెలికాం మెంబర్ ఇస్మాయిల్, సిరాజ్, మొయిన్దిన్, అన్ని మండలాల మండల అధ్యక్షులు కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333