ఉద్యోగుల వేతనాల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు వైఖరి ని తీవ్రంగా ఖండింస్తూ TS PRTU

Mar 9, 2024 - 20:19
 0  0

తెలంగాణ వార్త  ఉద్యోగుల వేతనాల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం: PRTU TS సూర్యాపేట జిల్లా ప్రతినెల ఉద్యోగులకు చెల్లించే వేతనాలు పట్ల మాజీ ఆర్థిక మంత్రి ఉద్యోగులను కించపరిచే విధంగా ఉద్యోగుల విధులను పనితీరును హక్కులను కాలరాసే విధంగా అవమానపరుస్తూ జీతాల గురించి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం సరికాదని PRTU TS సూర్యాపేట జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జ్యోతుల చంద్రశేఖర్ చింతారెడ్డి రామలింగారెడ్డి ఈరోజు సూర్యాపేట జిల్లా శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తీవ్రంగా ఖండించారు 42 రోజులపాటు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు ఉద్యోగాలను పణంగా పెట్టి పోరాటం చేసిన ఉద్యోగులను కించపరిచే విధంగా రైతులకు ఉద్యోగులకు ముడిపెట్టి బోడి గుండుకు మోకాళ్ళకు లంక పెట్టిన విధంగా మాట్లాడడం సరికాదు అన్నారు ఉద్యోగుల పట్ల ఇలాంటి వైఖరిని కలిగి ఉండటం ఉద్యోగులకు సంబంధించిన అనేక బిల్లులు ఆర్థికపరమైన అనేక అంశాలను పెండింగ్లో పెట్టి ఉండటం మూలాన ప్రభుత్వమే మారిన విషయం గమనించాలని ఇంకా ఇలాంటి వైఖరిని కొనసాగిస్తే భవిష్యత్తులోతీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని తెలియజేశారు *PRTU సూర్యాపేట జిల్లా*