నిక్షయ శివర్ క్యాంప్

సూర్యాపేట మున్సిపాలిటి లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంబేద్కర్ నగర్ మరియు గిరినగర్ పరిదిలో 18 వ, వార్డు లో గల సుధాకర్ పీవీసీ పైపుల కంపెనీ లో ప్రత్యేక (NIKSHY SHIVAR) నిక్షయ శివర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో కంపెనీ లో పని చేసే డ్రైవర్లు,సూపర్వైజర్లు,సిబ్బంది లో >60 సంవత్సరాల పై బడిన మధుమేహం (షుగర్) వ్యాధి లక్షణాలు, TB వ్యాధి లక్షణాలు ఉన్నటువంటి , గత అయిదు సంవత్సరాల క్రితం వున్న TB patients, గత రెండు సంవత్సరాలుగా వున్న TB patients వారి కుటుంబ సభ్యులకు మరియు మధ్య పానం, ధూమపాన,పోషకాహారలోపం తో బరువు తక్కువగా వున్న 10 మందిని గుర్తించి వారినుండి కళ్లె (తేమడ) నమూనాలు సేకరించి పరీక్ష నిమిత్తం CBNAAT LAB కు మరియు 110 xray లు తీసి పలోమోనోలజిస్ట్ కి పంపడం జరిగింది. తేమడ పరీక్ష లో మరియు చేస్ట్ x ray లలో క్షయ వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఆరు నెలలు ఉచితంగా మందులు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇవ్వడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో టీబీ జాయింట్ డైరెక్టర్ డా,రాజేశం సార్, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా; కోటచలం సార్, నల్లగొండ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ సార్, జిల్లా టిబి నియంత్రణ అధికారి డా; నాజియా తబ్సం,జేడీ HEO మొగిరాల శ్రీనివాస్ , డా. రమ్య రెడ్డి , డా. సుశాంక్, డా. హరి ప్రసాద్ మరియు స్థానిక సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ వసుమతి,DRTB కోఆర్డినేటర్ ప్రసాదరావు మరియు యాకస్వామి, రవి వైద్య సిబ్బంది సూపర్వైజర్స్ ,ANM లు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఆశా కార్యకర్తలు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.