గణనాదుడి ఆశీస్సులు తెలంగాణ ప్రజల అందరిపై ఉండాలి

ప్రశాంత వాతావరణంలో నవరాత్రి వేడుకలు జరుపుకోవాలి.
భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించుకోవాలి..
* తెలంగాణ ప్రజలందరికి వినాయకచవితి శుభాకాంక్షలు ..*
* తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు పంతంగి వీరస్వామి గౌడ్.
వినాయకుడి ఆశీస్సులు తెలంగాణ ప్రజలందరిపై ఉండాలని.. ఐక్యతతో పాటు భక్తిశ్రద్దలతో ప్రశాంత వాతావరణంలో నవరాత్రి వేడుకలను జరుపుకోవాలని కోరతూ తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్ తెలంగాణ ప్రజలందరికి వినాయకచవితి శుభాకాంక్షలు ఒక ప్రకటనలో తెలిపారు. ఎటువంటి విఘ్నాలు కలుగకుండా తెలంగాణ సమాజం ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఏక దంతుడి దీవెనలతో ప్రజలంతా శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లి విరిసేలా గణపతి నవరాత్రోత్సవాలు జరుపు కోవాలని అయన విజ్ఞప్తి చేశారు.