ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకోవాలి ఎంపీడీవో శంకరయ్య

అడ్డగూడూరు 15 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
సామాజిక ఆర్థిక,విద్య , ఉపాధి,రాజకీయ, కులగణన సర్వేలో గతంలో సర్వలో నమోదు చేసుకోని వారు,తిరిగి నమోదు చేసుకొనుటకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసి ఉన్న ప్రజాపాలన సేవా కేంద్రంలో ప్రత్యక్షంగా హాజరై వారి కుటుంబ సభ్యుల వివరాలతో సర్వే ఫారం నింపి అప్లోడ్ చేసుకోవలెను.టొల్ ప్రీ నెంబర్ 040-21111111 ద్వారా పేరు నమోదు చేసుకుంటే వారి ఇంటికి వచ్చి సర్వే ఫారం పూర్తి చేయబడును.అదేవిధంగా ఆన్లైన్లో సామాజిక కులగణన సర్వే ఫారం డౌన్లోడ్ చేసుకొని పూర్తి స్థాయిలో ఫారం నింపిన దరఖాస్తులు ప్రజాపాలన సేవా కేంద్రం ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించ అప్లోడ్ చేసుకోవచ్చును
కావున అడ్డగూడూరు మండలంలోని సమస్త గ్రామ ప్రజలకు తెలియజేయునది ఏమనగా గతంలో సర్వేలో పాల్గొనని కుటుంబ సభ్యులు మిగిలి ఉన్న వారు దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకొని 100% సర్వే పూర్తి చేసుకొనుటకు సహకరించవలసిందిగా కోరనైనది.
ఆఖరి తేదీ ఫిబ్రవరి నెల 28 తారీకు వరకు ఉంటుందని ఒక ప్రకటనలో ఎంపీడీవో శంకరయ్య తెలిపారు.