నవంబర్ 15న జరగబోయే స్పెషల్ లుక్ అదాలత్ ని వినియోగించుకోవాలి
మునగాల 11 నవంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి :- రాజీ మార్గమే రాజ మార్గమని, సమన్యాయం సత్వర పరిష్కారం అవుతుందని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. మంగళవారం పోలీస్ స్టేషన్ లో ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 15న కోదాడ కోర్టు నందు నిర్వహించే స్పెషల్ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.రాజీ మార్గమే రాజ మార్గమని అన్నారు. సమయాన్ని,డబ్బులను ఆదా చేసుకోవాలని,కక్ష కారుణ్యాలతో ఏమీ సాధించలేమన్నారు. రాజీ పడితే ఇద్దరూ గెలిచినట్లేనని తెలిపారు.లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందన్నారు. కొట్టుకుంటే ఒకరే గెలుస్తారని, రాజీ పడితే ఇద్దరు గెలుస్తారన్నారు. జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడ దగిన కేసులో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబ పరమైన నిర్వాహణ కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్ కేసులలో కక్షిదారులు రాజీ పడాలని సూచించారు. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృధా చేసుకోవద్దని, జుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.లోక్ అదాలత్ ద్వారా కేసుల సత్వర పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు.