**ఆసుపత్రి లలో సౌకర్యాలు కల్పించాలని బి.ఆర్.ఎస్ నాయకుల విన్నతి**
*ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించాలని BRS నాయకుల వినతి.
*స్పందించిన జిల్లా వైద్య విధాన పరిషత్ అధికారి వెంకటేశ్వర్లు గారు
*ఆసుపత్రిలో డాక్టర్లు ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మసిస్ట్ ల కొరత పై కలెక్టర్ కు నివేదిక పంపిన జిల్లా వైద్య విధాన పరిషత్ అధికారి
నడిగూడెం BRS నాయకులు సెప్టెంబర్ 08న నడిగూడెం సామాజిక కేంద్రాన్ని పరిశీలన చేసి ఆసుపత్రిలో డాక్టర్లు టెక్నీషియన్లు ఫార్మసిస్ట్లు కొరత ఉందని వినతి పత్రం ఇవ్వటంతో జిల్లా వైద్య విధాన పరిషత్ అధికారి తనిఖీ చేసి పై విషయాల కొరత పై కలెక్టర్ కు నివేదిక పంపినందుకు BRS మండల సమన్వయ కమిటీ సభ్యులు అనంతుల ఆంజనేయులు జిల్లా వైద్య విధాన పరిషత్ అధికారికి కృతజ్ఞతలు తెలియజేసినారు వెంటనే కలెక్టర్ గారు స్పందించి DMHO ద్వారా కొరతను తీర్చాలని లేనియెడల కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారి ఆదేశానుసారం BRS పార్టీ తరపున కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నాలు చేసి రోగులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని అన్నారు