ధరూర్,KT దొడ్డి నూతన పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణాలకు ఎంపిక చేసిన స్థలాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్

Apr 2, 2025 - 19:43
 0  24

జోగులాంబ గద్వాల 2 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: ధరూర్, KT దొడ్డి. మండల కేంద్రాలలో నూతన పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణాలకు ఎంపిక చేసిన స్థలాలను జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్  డి.ఎస్పి శ్రీ వై. మోగిలయ్య , గద్వాల్ సిఐ శ్రీ టి శ్రీను తో కలిసి సందర్శించి పరిశీలించారు.  ధరూర్ మండల ప్రజల సౌకర్యార్థం , మండల ప్రజలకు అందుబాటులో ఉండే విదంగా ధరూర్ మండల కేంద్రంలో  MRO కార్యాలయం దగ్గర ఉన్న స్థలాన్ని, పారుచర్ల స్టేజీ దగ్గర, జాంపల్లి గ్రామం దగ్గర ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. ఈ స్థలాల్లో ప్రజలకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసి త్వరలో నుతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. అలాగే KT దొడ్డి మండల కేంద్రము లో ఇప్పటికే ఎంపిక చేసిన పోలీస్ స్టేషన్ స్థలాన్ని కూడా జిల్లా ఎస్పీ  సందర్శించి భూమికి సంబంధించిన వివరాలు పరిశీలించారు. 

ఈ కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ ఏ. ఈ అనీల్ శాస్త్రి, ధరూర్,KT దొడ్డి ఎస్సై లు శ్రీ హరి, శ్రీనివాస్ లు, ధరూర్ పంచాయతీ సెక్రటరీ పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333