శ్రీ బీచుపల్లి పుణ్యక్షేత్రంలో గల శ్రీశ్రీశ్రీ కోదండరామస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ శ్రీరామనవమి ఆహ్వాన పత్రిక

తేదీ-03-04-2025 గురువారం నుండి బ్రహ్మోత్సవాలు జరుగును తేది-06-04-2025 శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం ......
జోగులాంబ గద్వాల 2 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: ఎర్రవల్లి . మండలం,శ్రీ బీచుపల్లి పుణ్యక్షేత్రంలో గల కృష్ణా నది సమీపాన వెలసిన శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం లో తేది-03-04-2025 గురువారం నుండి బ్రహ్మోత్సవాలు జరుగును తేది-06-04-2025 రోజున శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణము అంగరంగ వైభోగంగా జరుగును కళ్యాణమునకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి ఆనందించ గలరని, కోరుతున్నాము కళ్యాణం తదనంతరం దేవాలయమునకు విచ్చేసిన భక్తులకు మరియు కళ్యాణమునకు విచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ సీతారామి రెడ్డి తెలియజేశారు.