విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ్ళ

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ్ళ:- ప్రాథమిక పాఠశాల తుమ్మల పెన్ పహాడ్ లో స్వపరిపాలన దినోత్సవం జరుపుకోవాలని జరిగింది.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి. ప్రధానోపాధ్యాయులు T. రామయ్య మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలో ఉత్తమ పౌరులుగా తయారవ్వాలని ప్రతి రోజు ఉపాధాయులు చెప్పే పాఠ్యాంశాలను శ్రద్దగావిని అర్థం చేసుకోవాలని కోరినారు. ప్రతి రోజు ఉదయం లేవగానే తల్లిదండ్రులకు నమస్కారం చేయాలని తెలియ చేశారు. స్వపరిపాలన సందర్భంగా ఈ రోజు కలెక్టరుగా మనోజ్ డిఇఒ గా కార్తీక్, యం ఇ ఓ గా పవన్ గ్రామ సర్పంచిగా వీక్షిత ప్రధానోపాధ్యాయులుగా సాత్విక్ మరియు ఉపాధ్యాయులుగా అఖిల్, ప్రణిత చరణ్ శివకేశవ నాగాచారి పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయు నిమ్మల శ్రీనివాస్ జయప్రద,షర్మిల, సునిత, మమత తదితరులు. పాల్గొన్నారు.