సెంట్రల్ యూనివర్సిటీని కాపాడుకునేందుకు పోరాటం చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జిని తీవ్రంగా ఖండిస్తున్నాం

Apr 2, 2025 - 20:06
 0  7
సెంట్రల్ యూనివర్సిటీని కాపాడుకునేందుకు పోరాటం చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జిని తీవ్రంగా ఖండిస్తున్నాం

ఇది ఇందిరమ్మ పాలన కాదు..రాక్షస పాలన.

BRSV రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య

జోగులాంబ గద్వాల 2 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : 
* రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అరాచక పాలన నడుస్తుంది టార్గెట్ విద్యార్థులు ప్రభుత్వ విద్యా వ్యవస్థలు.
* రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోంది.
* సోషల్ మీడియా,మీడియా, రైతులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంది.
 విద్యార్థులు,యువత మద్దతుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
* తెలంగాణ ఉద్యమం 1969లో వచ్చాక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది.
* సెంట్రల్ యూనివర్సిటీని కాపాడుకునేందుకు విద్యార్థులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది.
* కాంగ్రెస్ అంటేనే కేసులు,లాఠీఛార్జిలు.
* మంత్రులు అక్కసు వెళ్లగక్కి విద్యార్థులను అవమానించి పెయిడ్ బ్యాచ్ అని మాట్లాడారు.
* పెయిడ్ బ్యాచ్ సీఎం,మంత్రులు
* విద్యార్థులు పెయిడ్ బ్యాచ్ అయితే కేసులు, లాఠీఛార్జిలు భరిస్తారా..?
* పీసీసీ,సీఎం,మంత్రి  పదవులు పేమెంట్ తోనే అవుతున్నాయని ప్రజలకు తెలుసు.
* పేమెంట్ మీద పేటెంట్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది.
* పేమెంట్లతోనే కాంగ్రెస్ నేతలకు పదవులు వచ్చాయి
* కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు పేమెంట్లతో పదవులు పొందారు అని అన్నారు.
* తక్షణమే విద్యార్థులకు క్షమాపణ చెప్పి విద్యార్థులపై చేస్తున్న లాట్చార్జిని ఆపివేసి విడుదల చేయాలని హెచ్చరిస్తూ డిమాండ్ చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333