దళిత ఎమ్మార్వో పై దాడి చేసి కులం పేరుతో దూషించిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి

Nov 13, 2024 - 19:02
 0  1
దళిత ఎమ్మార్వో పై దాడి చేసి కులం పేరుతో దూషించిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి

సంఘటన స్థలాన్ని ఆర్డిఓ, డిఎస్పి  సందర్శించాలి  

జమ్మన్న తెలంగాణ దళిత సమాఖ్య జిల్లా అధ్యక్షుడు

 జోగులాంబ గద్వాల 13 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఇటిక్యాల.విధి నిర్వహణలో ఉన్న దళిత ఎమ్మార్వో పై కులం పేరుతో దూషించి,దుర్భాషలాడి దాడి చేసిన మునగాల ప్రభాకర్ రెడ్డి వారి అనుచరులను అరెస్టు చేసి రిమాండ్ చేయాలని తెలంగాణ దళిత సమైక్య జిల్లా అధ్యక్షుడు జమ్మన్న డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఇటిక్యాల మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న దళిత ఎమ్మార్వో నరేందర్ పై మునగాల గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి, వారి అనుచరులు కులం పేరుతో దూషిస్తూ,విధులపరంగా ఆటంకం కలిగించి, దాడికి పాల్పడిన మునగాల గ్రామనికి చెందిన ప్రభాకర్ రెడ్డిని వారి అనుచరులను ఇటిక్యాల మండల పోలీసులు అరెస్టు చేసి చార్జిషీట్ వేయలన్నారు. దాడి సంఘటన జరిగే పది రోజులు దాటిన కానీ నేటి వరకు వారిని అరెస్టు చేయకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగి అందులోనూ దళిత  సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పై దాడి చేస్తే రాజకీయ నాయకులకు తలోగ్గి ఇటిక్యాల ఎస్ఐ దాడి చేసిన వ్యక్తులపై సాధారణ సెక్షన్లను పెట్టి వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చార్జ్ సీట్లో  
  ఎస్సీ ఎస్టీ 3 (2)(వి ఏ) సెక్షన్లు చేర్చాలని,
 అగౌరపరిచినందుకు ఎస్సీ ఎస్టీ 3(ఎస్ ),(ఆర్ ) సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దాడి జరిగిన రోజు సంఘటనపై ఎమ్మార్వో నరేందర్ ఇటిక్యాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు చేసిన గాని ఇప్పటివరకు ఇటిక్యాల మండల ఎస్సై మునగాల ప్రభాకర్ రెడ్డిని వారి అనుచరులను అరెస్టు చేయకపోవడం సమంజసం కాదని అన్నారు.ఒక మండలానికి మెజిస్ట్రేట్ గా ఉన్న ఎమ్మార్వోపై ఈ విధమైన దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. దాడి చేసిన వ్యక్తులను రక్షించేందుకే అట్రాసిటీ కేసును నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉద్యోగి దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి న్యాయం జరగాలంటే తక్షణమే ఆర్డీవో, డిఎస్పి సంఘటన స్థలాన్ని పరిశీలించి నిష్పక్షపాతముగా విచారణ చేసి నివేదికను పై అధికారులకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు. దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ చేయాలని రిమాండ్ చేయని పక్షంలో అన్ని ప్రజాసంఘాలతో కలిసి పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని ఆయన అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333