కృష్ణవేణి ప్రైవేట్ హై స్కూల్ యజమాని పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి.

Feb 3, 2025 - 19:38
 0  2
కృష్ణవేణి ప్రైవేట్ హై స్కూల్ యజమాని పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి.

 ప్రజావానిలో జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన

బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య

జోగులాంబ గద్వాల 3 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి:  గద్వాల. జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ ని కలిసి ఐజ మండల కేంద్రంలోని కృష్ణవేణి ప్రైవేట్ హైస్కూల్లో  అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను మానసిక ఒత్తిడికీ గురి చేస్తూ  తీవ్రంగా  విద్యార్థులను చితకబాదుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆ యజమానిపై కఠినమైన చర్యలు తీసుకొని ఆ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య మాట్లాడుతూ..జిల్లాలోని ప్రైవేట్ స్కూల్స్ లో విద్యార్థులకు సరైన మౌలిక వస్తువులు కల్పించకుండా ఫీజులు మాత్రం వేలకు వేలు వసూలు చేస్తున్నారు. ఒక్క స్కూల్లో కూడా సరైన మౌళిక వసతులు లేవు: నీటి వసతి సౌకర్యం లేదు, మరుగుదొడ్లు లేవు, పాఠశాలకు ప్రహరీ గోడ లేదు, ఫైర్ సేఫ్టీ లేదు, ఫిట్నెస్ లేని బస్సులో నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎంఈఓ లు గాని డీఈఓ గానీ తనిఖీలు చేసే పరిస్థితి లేదు. స్కూల్స్ లలో సమయపాలన పాటించడం లేదు. సెలవుల రోజుల్లో కూడా విద్యార్థులకు స్కూల్స్ నడిపి మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు.  విద్యార్థులకు దగ్గర ఫీజులు వేలకు వేలు వసూలు చేసి ఉపాధ్యాయులకు మాత్రం తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని భారం తో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు.  కేవలం విద్యా తో వ్యాపారం చేస్తూ నాసిరకం విద్యను విద్యార్థులకు అందిస్తున్నారు.  ఫీజులు కట్టకపోతే చిన్నపిల్లలు అని చూడకుండా విద్యార్థులను తీవ్రమైన ఇబ్బందుల గురి చేసి బయట నిలబెట్టి తల్లిదండ్రులకు ఫోన్ చేయిస్తున్నారు.  

   ఈ సందర్భంలో విద్యార్థులను చితకబాదుతున్న ప్రైవేట్ స్కూల్ యజమాన్యంపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కి జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య  డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాధవ్, నరేష్, చక్రవర్తి ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333