ఎస్సి,ఎస్టీల హక్కులను కాపాడే బాధ్యత అధికారులదే దాసరి తిరుమలేష్
మోత్కూర్ 01 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని కొండగడపలో ఎమ్మార్వో రాంప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది.(సివిల్ రైట్ డే) పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న యాదాద్రి భువననగిరి జిల్లా ఎస్సి, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి తిరుమలేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ..ఎస్సి, ఎస్టీల హక్కుల కు ఎవరైనా ఇతరులు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటారని ఎవరికైనా ఇబ్బంది అయితే వెంటనే పోలిస్టేషన్ లో పిర్యాదు చెయ్యాలని వారికి డివి&ఎం సి అండగా ఉంటుందని తప్పుడు పిర్యాదులు చెయ్యకూడదని ఇంకా మిమి సమస్యలను ఆయా శాఖలల్లోని అధికారుల కార్యాలయాలల్లో మీయొక్క పనులకు సంబందించిన న్యాయ బద్ధమైన పనులు జరగక ఉన్న వాళ్ళు మీ గ్రామాల్లో జరిగే సివిల్ రైడ్స్ డే కార్యక్రమాలకి అన్ని శాఖల మండల& మున్సిపాలిటీ స్థాయి అధికారులు పాల్గొంటారని మీ సమస్యలను మీ గ్రామంలోకి వచ్చిన అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకునే అవసరం ఉందని అన్నారు. తాసిల్దార్ అన్ని శాఖల అధికారులకు ప్రోగ్రామ్ కి ముందు రోజుల్లోనే అన్ని శాఖల అధికారులకు అధికారిక లెటర్ ద్వారా సమాచారం ఇవ్వాలని తెలియజేశారు.
మోత్కూర్ ఎస్.ఐ నాగరాజు మాట్లాడుతూ గ్రామాల్లో కుల వివక్ష పేరుతో దళితులను ఇబ్బంది పెడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని దళిత యువకులు యువతులు చదువుల్లో ముందుకు పోవాలని చదువుతోనే అంటరాని తనాన్ని పూర్తిగా నిర్ములించగలుగుతామణి అన్నారు ఈ కార్యక్రమంలో హెచ్ డబ్ల్యు ఓ ఎస్సి బాలికల హాస్టల్ వార్డెన్ రాజాలు బై, r.i సుమన్, స్థానిక కౌన్సిలర్ ఎర్రవెల్లి మల్లమ్మ యాదయ్య, లైన్ మెన్ భాస్కర్, రేషన్ డీలర్, అంగన్వాడీ సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది, ఎర్రవెల్లి యాదయ్య, తొంట భాస్కర్, తొంట నరేష్, బోడ భాస్కర్, ఎర్రవెల్లి ఐలుమల్లు, ఎర్రవెల్లి నవీన్, ఎర్రవెల్లి మధు ఎర్రవెల్లి పరుశరాములు, ఎర్రవెల్లి నరేందర్, ఎర్రవెల్లి మధు, ఎర్రవెల్లి యాదయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.