వేసవికాలంలో ప్రజలకు మంచినీరు అందించాలి ఎమ్మెల్యే మందుల సామెల్
,,,,ప్రతి వాడ ప్రతి గ్రామం లో నీటి వసతి కల్పించాలి.
తిరుమలగిరి 29 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్ :- తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ఎం ఎల్ ఏ క్యాంప్ ఆఫీసులో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ బుధ వారం నాడు మిషన్ భగీరథ నియోజక వర్గ అన్ని స్థాయిల ఈ ఈ, డి ఈ ఈ, ఏ ఈ, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ రానున్న వేసవికాలంలో నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామంలో కూడా నీటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనమీద వున్నది అని అధికారులతో చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మిషన్ భగీర ద్వారా మంచినీటి సరఫరాలో అంతరాయం లేకుండా ప్రజలకు నీటిని సరఫరా చేయాలని కోరారు గ్రామంలో ఉన్న సిబ్బంది ఎప్పటికప్పుడు మిషన్ భగీరద కు సంబంధించిన పైపులను నీటి ట్యాంకులను సందర్శించి ప్రతి నెల క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని ఆయన కోరారు అంతరాయం ఏర్పడితే సహించేలేదని ఆయన అన్నారు, రానున్న వేసవికాలం దృష్ట్యా ముందు జాగ్రత్తగా అధికారులు ముందస్తుగా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి ఈ ఈ లు అధికారులు పాల్గొన్నారు