తాసిల్దార్ కార్యాలయంలో ఆర్డిఓ విచారణ
తెలంగాణవార్త ఆత్మకూరు యస్ ప్రతినిధి.తహశీల్దారు కార్యాలయం లో rdo విచారణ* ఇద్దరు అధికారులకు అబ్సెంట్, Mro కు షోకాజ్ నోటీసు.. ఆత్మకూర్ ఎస్.... మామూళ్ల మత్తులో రెవెన్యూ కార్యాలయం , ఇసుక ఆక్రమణ రవాణా సమయ పాలన పాటించని రెవిన్యూ కార్యాలయం గత రెండు రోజులు గా పత్రికల్లోవచ్చిన కథనాలకు స్పందించిన కలెక్టర్ విచారణ చేపట్టాలని ఆర్డీవో వేణు మాధవరావు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం ఆత్మకూర్ ఎస్ తాసిల్దార్ కార్యాలయంలో ఆర్డిఓ వేణు మాధవరావు విచారణ చేపట్టారు. ఆర్డిఓ కార్యాలయానికి ఉదయం 10గంటలకు కార్యాలయానికి చేరుకున్నారు.10:30 వరకు తహసిల్దార్, సర్వేయర్, సీనియర్ అసిస్టెంట్ కార్యాలయానికి రాకపోవడంతో వారికి అటెండెన్స్ రిజిస్టర్లు ఆబ్సెంట్ వేశారు .
తాసిల్దార్ కి ఫోన్ చేయగా 11:15 నిమిషాలకు కార్యాలయానికి రావడంతో ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయ సిబ్బందిని ఒకరిని తర్వాత ఒకరిని ఆలస్యానికి కారణం ఏమిటి అంటూ ఆరా తీశారు. ఇకనుండి పది గంటల 30 నిమిషాల తర్వాత కార్యాలయానికి వచ్చినట్లయితే వారిపై తగిన చర్యలు ఉంటాయని సిబ్బంది ద్వారా లిఖితపూర్వకంగా తీసుకున్నారు. మండలంలో అక్రమంగా ఇసుక రవాణా పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఇసుక తరలింపు చేస్తే కటిన చర్యలు తీసుకోవాలన్నారు. బొప్పారం గ్రామంలో సర్వేనెంబర్ 101 లో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను పరిశీలించి వెంటనే నిలిపివేయాలని తాహసిల్దార్ ను ఆదేశించారు. అక్రమ నిర్మాణాలు జరగకుండా తీసుకోవాలన్నారు. మామూళ్ల మత్తులో తాహసిల్దార్ కార్యాలయం పై విచారణ చేపట్టి నివేదికను జిల్లా కలెక్టర్ కు అందజేస్తామన్నారు. తహసిల్దార్ వినోద్ కుమార్ కు శోకాస్ నోటీస్ అందజేసి 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో ఆర్ ఐ అంజయ్య, ఇంద్రకుమార్, బూర వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు.