గౌడిచర్ల సత్యనారాయణ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిశోర్

తిరుమలగిరి15 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగం (బీఆర్ఎస్కేవీ ) నియోజకవర్గ అధ్యక్షులు గౌడిచర్ల సత్యనారాయణ గౌడ్ జన్మదిన సందర్భంగా మంగళవారం తిరుమలగిరిలోని మాజీ ఎమ్మెల్యే కిశోర్ నివాసంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ లను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా గౌడిచర్ల సత్యనారాయణ గౌడ్ ను శాలువాతో సత్కరించి మిఠాయి తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో కార్మికుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘమైన కార్మిక విభాగాన్ని అభివృద్ధి చేస్తూ నాయకుడిగా ఎదుగుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు సత్యనారాయణ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.