ఎర్రవల్లి మండల నూతన ఎమ్మార్వో ని కలిసిన కాంగ్రెస్ నాయకులు.

జోగులాంబ గద్వాల 23 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఎర్రవల్లి. మండలానికి నూతన ఎమ్మార్వో గా నరేష్ బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా వారికి పూలమాల శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది .
అందెబోయిన్ వెంకటేష్ యాదవ్ మండల పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాల ప్రజల సమస్యలపై పరిసర ప్రాంతాల సమస్యలపై పూర్తి అవగాహనతో అత్యున్నతమైనటువంటి ఆలోచన విధానంతో ప్రజలకు మీ సేవలు అందాలని ప్రజల సాధకబాదకాలపై సుదీర్ఘ ఆలోచన విధానంతో మీ యొక్క మెరుగైన సేవలతో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని ఆశిస్తూ ప్రజల ఆశీర్వాదం మీరు పొందాలని ఆకాంక్షిస్తూ ఎమ్మార్వో కి సన్మానం చేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో
మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రుక్మానందరెడ్డి
డిసిసి జనరల్ సెక్రెటరీ మద్దిలేటి
రాజు భాస్కర్ రెడ్డి ఉమాపతి నాయుడు వెంకటేష్ శ్రీనివాసులు మునిస్వామి ఈదన్న నాయుడు తిమ్మారెడ్డి సత్యం నాయుడు రామ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.