**అంబేద్కర్ జయంతి వేడుకలు""మంత్రి పొంగిలేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు*

Apr 14, 2025 - 14:58
 0  3
**అంబేద్కర్ జయంతి వేడుకలు""మంత్రి పొంగిలేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు*

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం : *ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం మరియు మంత్రి పొంగులేటి ఖమ్మం క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు*

ఖమ్మం : రాజ్యాంగ నిర్మాత, సామాజిక సంస్కర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం క్యాంపు కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. *క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి గారి* తో పాటు *కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు భూక్యా సురేష్ నాయక్* కార్యకర్తలు, అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సమాజంలో నిరుపేద, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు ఈ *కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్ నాగార్జునపు ప్రద్యుమ్న చారి, జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాలు రాయల.కృష్ణవేణి ,కాంగ్రెస్ పార్టీ నాయకులు తేజవత్ పంతులు నాయక్ , బోడా.శ్రావణ్,దుంపల రవి కుమార్, గునిగంటి సురేష్ ,కళ్లెం.శేష్ రెడ్డి ,వెంపటి రవి,బండి మల్లికార్జున్ ,మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు*

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State