ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
ఎల్బీనగర్ చౌరస్తా హైదరాబాద్
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
తెలంగాణ రాష్ట్ర మాదిగ కళామండలి ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు డాక్టర్
మల్లెపాక అనిల్ కుమార్
భారత రాజ్యాంగ రూపశిల్పి,భారతరత్న.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గ ఎంఆర్పిఎస్ నాయకత్వం లో,దళిత సంఘాలు ,కుల సంఘాలు ,ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు, సాహితీవేత్తలు, కవులు కళాకారులు మరియు అన్ని రాజకీయ పార్టీల వారు అక్కడికి విచ్చేసి ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి శుభాకాంక్షలు తెలిపారు పలువురు కళాకారులు అంబేద్కర్ పై గేయాలు పాడుతూ అక్కడికి విచ్చేసిన వారందరినీ ఉత్తేజపరిచారు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాటి కాలంలో కుల వివక్షతకుగురై ఎన్నో అవమానాలను భరించి అక్షరమే ఆయుధంగా మలుచుకొని ఆత్మవిశ్వాసంతో విద్యను అభ్యసించి దేశ విదేశాలలో రాజ్యాంగాలను చదివి మన భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప రాజ్యాంగ రూపశిల్పి ఆయన సేవలు ఎనలేనివి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గొప్ప ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాతగా భారత దేశ ప్రథమ న్యాయశాఖ మంత్రిగా ఆర్థికవేత్తగా బౌముఖ ప్రజ్ఞశాలిగా సంఘసంస్కర్తగా కీర్తి ప్రతిష్టలు పొందారు మనమందరం ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు
తెలంగాణ రాష్ట్ర మాదిగ కళామండలి అధ్యక్షులు ఎమ్మార్పీఎస్ (ఎంఆర్పిఎస్) డాక్టర్ మల్లెపాక అనిల్ కుమార్ కు ఆత్మీయ సన్మానం.
హోప్ స్వచ్ఛంద సేవా సమితి మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు
డాక్టర్ దైద వెంకన్న ఆధ్వర్యంలో డే స్ప్రింగ్ తియోలాజికల్ యూనివర్సిటీ" టాక్సెస్,అమెరికా వారిచే ఇటీవల డాక్టరేట్ స్వీకరించిన డాక్టర్ మల్లెపాక అనిల్ కుమార్ కు రోజ్ మొక్కను అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన రాజకీయ పక్షాల నాయకులు ఎమ్మార్పీఎస్ ఎల్బీనగర్ ఇన్చార్జి సుధాకర్ మాదిగ సూరారపు అశోక్ ఈదుల పరశురాములు ఏసోబు జిల్లా ముత్యాలు విజయ్ కుమార్ సురేష్ యాదగిరి వెంకన్న పర్యావరణ ప్రేమికురాలు ( బాల) దైద సింధు తెరిసా గ్రీన్ టవల్ తో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు దైద గ్రీష్మన్ మహాజన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ మల్లెపాక అనిల్ కుమార్ మాదిగ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు నాకు ఆత్మీయ సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో ఉత్సాహంగా సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తానని తెలిపారు
హోప్ స్వచ్ఛంద సేవా సమితి సింధు ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ చైర్మన్ దైద వెంకన్నకు ప్రజా , కుల ,సంఘాల నాయకులకు మరియు రాజకీయ పార్టీల నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.