చెన్నైలో తెలంగాణ బతుకమ్మ సంబరాలు

ముఖ్యతిదిగా పాల్గొన్న ఎమ్మెల్యే మందుల సామేల్

Oct 3, 2024 - 20:55
 0  92

అడ్డగూడూరు 03 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తెలంగాణలోనీ వివిధ జిల్లాల నుండి, గ్రామాల నుండి,చెన్నైలో తెలంగాణ ఆడపడుచులు నివసిస్తున్నారు. తెలంగాణ సంప్రదాయం ప్రకారం ఆడపడుచులు అందరు కలిసి చెన్నైలో ఘనంగా తెలంగాణ బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు.అతి ముఖ్యమైన సంప్రదాయ బద్ధమైన ఆడపడుచుల పండుగ బతుకమ్మ.దేశ విదేశాలలో ఉండే తెలంగాణా ప్రజలు ఎంతో సంప్రదాయ బద్దంగా నిర్వహిస్తుంటారు.అందులో భాగంగా బుధవారం ఎంగిలిపు బతుకమ్మ సంబరాలు చెన్నైలోని శ్రీ కన్యక పరమేశ్వరి మహిళా కళాశాల మైదానంలో చెన్నై తెలంగాణా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంగరంగా వైభవంగా నిర్వహించారు.ఇట్టి కార్యక్రమానికి ఎమ్మెల్యే మoదుల సామేలు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ చెన్నై తెలంగాణ తెలుగు ప్రజలు బతుకమ్మ పండుగను ఆడపడుచులు ఘనంగా నిర్వహించారని గత 11 సంవత్సరాలుగా జరుపుతున్న ఈ బతుకమ్మ పండుగను అన్ని కుల సంఘాల సహకారంతో చెన్నై తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం తెలుగు ప్రజల సంస్కృతికి నిదర్శనమని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు.అనంతరం వారితో పాటు ఆటలు ఆడి పాటలు పాడారు.ఈ కార్యక్రమంలో చెన్నై తెలంగాణ సంఘం అధ్యక్షులు అడ్డగూడూరు మండలం గట్టుసింగారం గ్రామానికి చెందిన ఎం పరశురాములు,తెలంగాణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మోత్కూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు బుంగపట్ల యాకయ్య ముదిరాజ్, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు ,సుంకరి జనార్ధన్ తెలంగాణ చెన్నై తెలుగింటి ఆడపడుచులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333