డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్117వ జయంతి.

బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసిన లింగారావు 

Apr 5, 2024 - 18:49
Apr 5, 2024 - 18:54
 0  52
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్117వ జయంతి.

కొండపాక, 05 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 117వ జయంతి ని  పురస్కరించుకొని ఈరోజు కొండపాక మండలం లోని వెలికట్ట X రోడ్ వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాసరి లింగారావు గారు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం మాట్లాడుతూ, ఆయన దేశానికి చేసిన సేవలను స్మరిస్తు అయన ఆశయాలను నెరవేర్చాలని మరియు ,భారత మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ మంత్రివర్గంలో ఉప ప్రధానిగా భారతదేశానికి ఎన్నో సంస్కరణలు సేవలను అందిచ్చారని కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాసరి లింగరావు మాట్లాడినారు .అనంతరం స్వీట్స్ పంచి పెట్టడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో కొండపాక మండల ఏసి సెల్ అధ్యక్షుడు కొమ్ము మల్లికార్జున్,కోఆర్డినేటర్ చిరంజీవి, మాజీ మండల అధ్యక్షులు అనంతుల నరేందర్,దుద్దెడ గ్రామ శాఖ అధ్యక్షుడు పంజా అఖిల్,  కొండపాక సోషల్ మీడియా మెరుగు ప్రభాస్,,వెలికట్ట గ్రామ ప్రధాన కార్యదర్శి దొమ్మట మహేష్, బీసీ సెల్ అధ్యక్షుడు కొమురవెల్లి శీను, యూత్ కాంగ్రెస్ డాన్ శీను  వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Rajkumar.Ch Nizambad Staff Reporter Nizambad Distste Telangana State