జిల్లాలో యూరియా కొరత లేదు - జిల్లా కలెక్టర్ బి.యo. సంతోష్ కుమార్

Dec 30, 2025 - 19:55
 0  13
జిల్లాలో యూరియా కొరత లేదు  - జిల్లా కలెక్టర్ బి.యo. సంతోష్ కుమార్

జోగులాంబ గద్వాల 31 డిసెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. జిల్లాలో రైతులకు కావాల్సినంత యూరియా అందుబటులో ఉందని, కొరత ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పలుచోట్ల రైతులు యూరియా కోసం బారులు తీరి ఇబ్బందులు పడుతున్నట్లు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. రైతులు ప్రస్తుత పంటకు కావాల్సినంత యూరియా తీసుకోవచ్చని, కొరత వస్తుందేమోనని ఆందోళన పడవద్దు అన్నారు. జిల్లాలో ఇప్పటిదాకా 5816 మెట్రిక్ టన్నుల యూరియా అందించగా, ఇంకా 8124 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. పిఎసిఎస్ కేంద్రాలతో పాటు అగ్రోస్ రైతు సేవా కేంద్రాల్లోనూ యూరియా అందుబాటులో ఉందన్నారు. గద్వాల మండల పిఎసిఎస్ కేంద్రం వద్ద రైతులు ఎక్కువగా లైన్ లో ఉంటుండడంతో పాత బస్టాండు, మార్కెట్ యార్డులో ఉన్న అగ్రోస్ కేంద్రాల వద్ద కూడా యూరియా తీసుకోవచ్చు అన్నారు. రైతులు యూరియా తీసుకునేందుకు వచ్చేటప్పుడు తమ పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ లు తీసుకొని రావాలన్నారు. యూరియా కొనుగోలులో ఎలాంటి సమస్యలు ఎదురైనా రైతులు సంబంధిత మండల వ్యవసాయాధికారులను సంప్రదించవ చ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333