76వ స్వాత్రంత్ర భారత దేశంలో అభివృద్ధి కి నోచుకోని కంతనపల్లి ఐలపురం గ్రామలు 

Feb 15, 2026 - 17:52
 0  0
76వ స్వాత్రంత్ర భారత దేశంలో అభివృద్ధి కి నోచుకోని కంతనపల్లి ఐలపురం గ్రామలు 
76వ స్వాత్రంత్ర భారత దేశంలో అభివృద్ధి కి నోచుకోని కంతనపల్లి ఐలపురం గ్రామలు 

బిట్టు రోడ్డు లేక ప్రయాణికుల ఇబ్బందులు

కన్నాయిగూడెం మండలం తెలంగాణ వార్త న్యూస్, ఫిబ్రవరి :15 ఉమ్మడి వరంగల్ జిల్లా లో ఉన్న గ్రామమైన ఏటూరునాగారం మండలం లో ఉన్న రెవిన్యూ గ్రామం ప్రస్తుతం ఉన్న ములుగు జిల్లా లోని కన్నాయిగూడెం మండలం లోని కంతనపల్లి గ్రామం ఈ గ్రామం ఏటూరునాగార నికి 20 కిలోమీటర్ల దూరం గల కంతనపల్లి గ్రామం ఈ గ్రామనికి రోడ్డు సౌకర్యం లేక 76 సంవత్సరలు కావస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టం నుండి తెలంగాణ రాష్టం ఏర్పడిన గాని అన్నాడు ఉన్న ముఖ్యమంత్రులు రాష్ట్ర మంత్రులు ఈనాడు ఉన్న ముఖ్యమంత్రులు రాష్ట్ర మంత్రులు కంతనపల్లి గ్రామాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు వైయస్ రాజశేఖర్ రెడ్డి కంతనపల్లి గ్రామంలో ప్రాజెక్టు పవర్ ప్లాంట్ ను శంకుస్థాపన చేసిన సమయంలో కూడా ఆ గ్రామానికి బీట్ రోడ్డు వేసే పరిస్థితి లేకుండా పోయింది. కారణం ఆ గ్రామములో ప్రజల పరిస్థితిని వారి రవాణా సౌకర్యాలను ఏమాత్రం కూడా ఆనాడు ఉండబడిన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి నుండి ఈనాడు ఉండబడిన రేవంత్ రెడ్డి వరకు కూడా కంతనపల్లి గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదని గ్రామస్తులు ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు.ఆదివాసీలుగా ఉండబడిన కంతనపల్లి గ్రామానికి ఇప్పటివరకు రోడ్డు సౌకర్యం లేదు ఐలపురం గ్రామనికి కూడా సరైన రోడ్డు లేదు ఆ గ్రామానికి ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామం నుండి లేదా స్థానిక మండలమైన కన్నాయిగూడెం సర్వాయి గ్రామం నుండి బిట్టు రోడ్డు సౌకర్యం కోసం ఎదురు చూస్తున ఆదివాసీ గ్రామాల ప్రజలు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఆదివాసీల ఆరాధ్య దైవమైన రాష్ట్ర మంత్రి సీతక్క వెంటనే కంతనపల్లి ఐలపురం గ్రామాలకు బిట్టు రోడ్డు రవాణా సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు ప్రయాణికులు రాష్ట్ర మంత్రిని కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333