ఇటిక్యాల పోలీసు వారి హెచ్చరిక
నూతన సంవత్సర వేడుకలు శాంతియుతంగా, సురక్షితంగా జరుపుకోవాలి – ఇటిక్యాల ఎస్ ఐ కె రవి
జోగులాంబ గద్వాల 30 డిసెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎర్రవల్లి మరియు ఇటిక్యాల మండలలో శాంతి భద్రతలు భంగం కలగకుండా ఉండేందుకు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ క్రింది నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఇటిక్యాల ఎస్ ఐ కె రవి తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
???? ఇవి అస్సలు చేయవద్దు:
డ్రంక్ అండ్ డ్రైవ్: .????????మద్యం సేవించి వాహనం నడిపితే వాహనం సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానా మరియు కేసు నమోదు చేయబడుతుంది.
ర్యాష్ డ్రైవింగ్: బైక్ రేసింగ్‌లు, అతివేగంగా వాహనాలు నడపడం, సైలెన్సర్లు తొలగించి శబ్దం చేయడం నిషేధం. ????️????
బహిరంగంగా మద్యం సేవించడం: రోడ్లు, పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరం.
డీజే (DJ) నిషేధం????????: శబ్ద కాలుష్యం కలిగించే డీజేలు, అధిక శబ్దంతో మ్యూజిక్ సిస్టమ్‌లకు అనుమతి లేదు.
అసభ్య ప్రవర్తన: రహదారులపై గుంపులు గుంపులుగా చేరి ఇతరులకు అసౌకర్యం కలిగించడం, అసభ్యంగా ప్రవర్తించడం నేరం.
అనుమతి లేని ర్యాలీలు / వేడుకలు: పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, పార్టీల నిర్వహణకు వీలు లేదు.
పబ్లిక్ ప్రాపర్టీకి నష్టం: రోడ్ సైన్‌బోర్డులు, స్ట్రీట్ లైట్లు తదితర ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే కేసులు నమోదు చేస్తారు.
✅ ఇవి తప్పనిసరిగా గుర్తుంచుకోండి:
పోలీసు అనుమతి తప్పనిసరి: ఏదైనా ఈవెంట్, పార్టీ లేదా సమావేశం నిర్వహించాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి.
సైబర్ భద్రత: న్యూ ఇయర్ ఆఫర్ల పేరుతో వచ్చే ఫేక్ లింక్స్, కాల్స్‌కు స్పందించవద్దు. బ్యాంక్, ఓటీపీ వివరాలు ఎవరికీ ఇవ్వకండి.
మైనర్లు: మైనర్లకు వాహనాలు ఇవ్వకండి. ఇలాంటి ఘటనల్లో తల్లిదండ్రులపై కూడా చర్యలు ఉంటాయి.
హెల్మెట్ & సీటుబెల్ట్: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలి.
సహకారం: పోలీస్ తనిఖీలకు ప్రజలు సహకరించాలి.???????????????? మీ క్షేమమే మా బాధ్యత:
నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి ఆనందంగా, బాధ్యతాయుతంగా జరుపుకోవాలని ఇటిక్యాల పోలీస్ వారు విజ్ఞప్తి చేస్తోంది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ ????100 లేదా ఇటిక్యాల పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని
కె.రవి మండల ప్రజలను కోరారు.
సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
ఇటిక్యాల పిఎస్.