పదోన్నతి బాధ్యతను మరింత పెంచుతుంది జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు, ఐపిఎస్

Dec 30, 2025 - 19:54
 0  33
పదోన్నతి బాధ్యతను మరింత పెంచుతుంది జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు, ఐపిఎస్
పదోన్నతి బాధ్యతను మరింత పెంచుతుంది జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు, ఐపిఎస్

ఏడు ఏళ్ల అంకితభావానికి గుర్తింపు — ఆర్‌ఐగా పదోన్నతి”

జోగుళాంబ గద్వాల 30 డిసెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి  :  గద్వాల్. జిల్లా పోలీస్ విభాగంలో మరో  విశేష పరిణామం చోటుచేసుకుంది. జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ ఎస్సై విజయభాస్కర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్‌గా పదోన్నతి పొందిన సందర్భంగా జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపిఎస్.ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ  విజయభాస్కర్‌కు స్టార్లు తొడిగి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. “ఉద్యోగ జీవితంలో పదోన్నతి కేవలం గౌరవం మాత్రమే కాదు, బాధ్యతను మరింత పెంచే ఘట్టం. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలి” అని ఎస్పీ సూచించారు.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ — విజయభాస్కర్ 6జోగుళాంబ గద్వాల్ జిల్లాలో ఆర్‌ఎస్‌ఐగా దాదాపు ఏడు సంవత్సరాల పాటు అంకితభావంతో సేవలందించారని తెలిపారు. అందులో నాలుగు సంవత్సరాలు గద్వాల్ ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహిస్తూ ట్రాఫిక్ నియంత్రణ, రహదారి భద్రత, ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణ వ్యవస్థ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. అదేవిధంగా మూడు సంవత్సరాలు జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తూ, సమన్వయంలో తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. తదుపరి నారాయణపేట జిల్లాకు బదిలీపై వెళ్తున్న విజయభాస్కర్  గద్వాల్ జిల్లాలో అందించిన సేవలను ఎస్పీ ప్రత్యేకంగా కొనియాడుతూ, కొత్త జిల్లాలోనూ ఇదే నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ఆకాంక్షించారు. 

ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ నరేందర్ రావు, ఆర్.ఐ. వెంకటేష్ పాల్గొని అభినందనలు తెలిపారు. ఈ పదోన్నతి కార్యక్రమం జిల్లా పోలీస్ విభాగంలో ఉత్సాహాన్ని నింపిన సందర్భంగా నిలిచింది.

...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333