బాల్యమిత్రుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత 

Mar 22, 2025 - 19:14
 0  4
బాల్యమిత్రుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత 

 బాల్యమిత్రుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇటీవల మరణించడంతో తమ మిత్రులందరు కలిసి మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి తమ బాల్యమిత్రుడు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వివరాల్లోకెళ్తే  సూర్యాపేట లోని కోమటికుంట కు చెందిన పిట్టల యుగేందర్ గత ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మరణించాడు. దీంతో తమ బాల్యమిత్రులు కుడ కుడ ప్రభుత్వ పాఠశాలలో 2001 -2002 బ్యాచ్  పదవ తరగతికి చెందిన స్నేహితులు దశదినకర్మ సందర్భంగా పిట్టల యుగేందర్ కుటుంబ సభ్యులకు 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్  అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ తమ బాల్యమిత్రుడు పిట్టల యుగేందర్ మరణం బాల్య మిత్రులందరికీ ఎంతో దుఃఖాన్ని మిగిల్చిందని అన్నారు. భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు చెప్పారు. స్నేహితుల ద్వారా సేకరించిన ఆర్థిక సహాయాన్ని అందించినట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలో ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గంగరబోయిన యుగేందర్,  m నాగరాజు, హరి,  కృష్ణ,శంకరాచారి, ఆలగడప లక్ష్మణ్, సతీష్, mవినయ్,  ఏలుగూరి  కిరణ్, వెంకటాచారి, సరిత, జ్యోతి, పి శేఖర్, జావేద్,రాంబాబు,  నేమనందం సైదులు, పంతంగి సాలయ్య, వెంకన్న, కనకతార, m శ్రావ్య, భవాని సరిత జి పాపయ్య, మస్కుద్, జి వెంకన్న, లింగరాజు, ఎండి అప్సర్, వై సురేష్,
తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333