జిల్లాలో టీజీ పి ఎస్ సి గ్రూప్- I వ్రాత పరీక్ష జరిగే కేంద్రాల వద్ద   144 సెక్షన్ అమలు

Jun 7, 2024 - 20:29
 0  1
జిల్లాలో టీజీ పి ఎస్ సి గ్రూప్- I వ్రాత పరీక్ష జరిగే కేంద్రాల వద్ద   144 సెక్షన్ అమలు

పరీక్షా కేంద్రాల వద్ద 105 మంది పోలీస్ లతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు

జిల్లా ఎస్పీ శ్రీమతి రితిరాజ్ IPS గారు

  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( టిజి పి ఎస్ సి) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు పోలీసు శాఖ తరపున అన్ని రకాల భద్రతపరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ రితిరాజ్ IPS గారు వివరించారు. జోగుళాంబ గద్వాల్ జిల్లాలో తేది: 09-06-2024 (ఆదివారం) నాడు TGPSC గ్రూప్-I ప్రిలిమినరీ  పరీక్ష కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా 105 మంది పోలీస్ సిబ్బందితో పకడ్బందీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ శ్రీమతి రితిరాజ్ IPS గారు తెలిపారు.
జిల్లాలో 14 పరీక్ష కేంద్రాలు గద్వాల్ టౌన్-11, గద్వాల్ రూరల్-1 ఎర్రవల్లి-2 కలవు. మొత్తం 5231 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. 
 పరీక్ష కేంద్రాలలో  తేది: *09-06-2023* నాడు ఉదయం 06:00 గం: నుండి మధ్యాహ్నం 1:00 గం: వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కావున  పరీక్ష సెంటర్స్ వద్ద నుండి 100 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దు మరియు పరీక్ష కేంద్రాల  సమీపంలో ఉన్న  అన్ని జిరాక్స్ సెంటర్స్, ఇంటర్ నెట్ సెంటర్స్,   మూసి వేయాలని, చుట్టుపక్కల లౌడ్ స్పీకర్స్ పెట్టరాదు.  అభ్యర్థులును ఉద్దేశించి ఎస్పీ గారు  మాట్లాడుతూ పరీక్షా సమయానికి 1:00 గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని, మానసికంగా ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని జిల్లా ఎస్పీ  గారు సూచించారు.

TGPSC గ్రూప్- I పరీక్ష వ్రాసే అభ్యర్థులకు సూచనలు 

???? పరీక్ష సమయం ఉదయం 10:00 నుండి మద్యాహ్నం 01:00 గంటల వరకు, నిర్వహించబడుతుంది.

????పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు బయోమెట్రిక్ మాదిరిగా ఫింగర్ ప్రింట్ తీసుకోవడం జరుగుతుంది వెరిఫికేషన్ సిబ్బందికి సహకరించవలసిందిగా  సూచించారు.

???? అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఒక కలర్ ఫోటో, ఒరిజినల్ ఆధార్ కార్డు /డ్రైవింగ్  లైసెన్స్ /ఓటర్ గుర్తింపు కార్డు / ఏదైనా ఒకటి తప్పనిసరిగా తీసుకొని రావాల్సి ఉందన్నారు.


 ???? పరీక్ష రోజున ఉదయం 9 గంటల నుండి అభ్యర్థులను ఎగ్జామ్ హాల్లోనికి అనుమతి ఇస్తారని, 10 గంటలకు ఎగ్జామ్స్ సెంటర్ గెట్ మూసి వేయడం జరుగుతుందని 10 గంటల తర్వాత ఒక్క సెకండ్ ఆలస్యంగా వచ్చిన ఎవ్వరిని  పరీక్ష కేంద్రం లోనికి అనుమతించడం జరగదు.

????డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ లో ఉన్న నిబంధనలు  అభ్యర్థులు చదువుకొని వాటిని పాటించాలని సూచించారు. 

????చివరి నిమిషంలో వచ్చి ఇబ్బంది పడకుండా సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అభ్యర్థులకు సూచించారు.  

???? పరీక్షా కేంద్రంలోకి బ్యాగులు, సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, వాచ్లు, క్యాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరు.

????అభ్యర్థులను మెటల్ డిటెక్టర్ ద్వార పరిశీలించి పరీక్షా కేంద్రంలోనికి పంపించడం జరుగుతుంది 

????అభ్యర్థులు తమ వెంట పరీక్ష హాల్ టికేట్, మరియు (బబ్లింగ్) బ్లూ, బ్లాక్, బాల్ పెన్స్ మాత్రమే తీసుకురావాలని సూచించారు.

???? అభ్యర్థులు ఎవరైనా మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్ చేసినట్లు తేలితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది....

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333