ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంను విజయవంతం చేయాలి

Mar 4, 2026 - 19:26
 0  0
ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంను విజయవంతం చేయాలి
ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంను విజయవంతం చేయాలి

జోగుళాంబ గద్వాల 4 మార్చి 2020 ఆరు తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. జిల్లాలో ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 99 రోజులపాటు నిర్వహించు ప్రజా పాలన... ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలపై బుధవారం ఐడిఓసి సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ ఈనెల 5న మండల స్థాయిలో తహసిల్దార్ లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి 99 రోజుల కార్యక్రమాలపై ప్రణాళిక తో ముందుకెళ్లాలన్నారు. ప్రభుత్వం 10 అంశాలతో ఐదు దశల్లో నిర్దేశిత తేదీలలో ఆయా కార్యక్రమాలను నిర్వహిస్తున్నందున అందుకు అనుగుణంగా ప్రణాళికను రూపొందించుకోవాలని ఆదేశించారు. మార్చి 6వ తేదీన గ్రామస్థాయిలో గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించాలన్నారు. ఆయా శాఖల పరిధిలో వివిధ సంక్షేమ పథకాల అమలు, చేపట్టిన అభివృద్ధి పనుల నివేదికలను సమగ్రంగా రూపొందించి సమర్పించాలన్నారు. భూభారతి, ట్రేడ్ లైసెన్స్, భవన నిర్మాణాల అనుమతులు, తదితర అన్ని దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు పనిచేయాల్సి ఉంటుందన్నారు. ప్రతి కార్యాలయం మొదలుకొని అన్ని గ్రామాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ తరపున చేయాల్సిన కార్యక్రమాలను వివరించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎన్సిడి స్క్రీనింగ్ లో, టీబీ పరీక్షల్లో చాలా వెనుకబడిందని, 99 రోజుల కార్యాచరణలో లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ప్రతి గురువారం మండల స్థాయిలో ఇందిరమ్మ ఇళ్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వంద శాతం లక్ష్యాలను సాధించాలన్నారు. వ్యవసాయం, మహిళా సంక్షేమం, యువత, పర్యావరణం, తదితర విషయాల్లోనూ ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లి జోగులాంబ గద్వాల జిల్లా రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో ముందుండేలా సంబంధిత శాఖల అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ 99 రోజుల ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేసేందుకు తమ శాఖ తరపున అవసరమైన సహాయ, సహకారాలను అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా కట్టడి చేశామని, ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో అర్రైవ్.. అలైవ్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని, పోలీస్ శాఖ తరపున ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్తామన్నారు. 

ఈ సమావేశంలో ఆర్డిఓ శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333