**రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకోవాలి""రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మేదరమెట్ల*

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ : *రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీర్చుకోవాలి*
*రైతుకు గిట్టుబాటు ధరను కల్పించాలి*
*రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మేదరమెట్ల*
*************************
రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మేదరమెట్ల వెంకటేశ్వర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
స్థానిక కోదాడ పట్టణంలో తెలంగాణ రైతు సంఘం (ఏఐకేఎస్) 89 వ ఆవిర్భ దినోత్సవ సందర్భంగా రైతు సంఘం జండా ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐకేఎస్ 1936 సంవత్సరంలో ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో ఆవిర్భవించి ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా రైతుల తరపున ఎన్నో ఉద్యమాలు చేసిందని, కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక మూడు చుట్టాలను వెనక్కి తీసుకునే వరకు విరోచక పోరాటాలు చేసిందని వారు అన్నారు ఈ పోరాటంలో 750 మంది రైతులు అమరులయ్యారని అయినా వెనుకడుగు వేయకుండా మోడీ ప్రభుత్వం మెడలు వంచి చట్టాలను ఆపడంలో ఆల్ ఇండియా కిసాన్ సభ కీలక పాత్ర పోషించిందని వారన్నారు. అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో ముందు భాగాన రైతు సంఘం ఉందని వారన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారన్నారు
ఈ యొక్క కార్యక్రమంలో సిఐటియు కోదాడ పట్టణ కార్యదర్శి ఎం ముత్యాలు కొండయ్య శేషయ్య సైదులు ప్రసాదు వెంకన్న చారి తదితరులు పాల్గొన్నారు.