చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు పై అడ్డుపడుతున్న భూకబ్జాదారులు
తిరుమలగిరి 05 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలంలోని చాకలి ఐలమ్మ విగ్రహం నిర్మించు స్థలంలో ఆదివారం రోజున తిరుమలగిరి మండల రజక సంఘం అధ్యక్షులు పులిమామిడి సోమన్న మాట్లాడుతూ తిరుమలగిరి మండల కేంద్రంలో గతంలో ప్రభుత్వ భూమి రజకులకు కేటాయించి దోబీ ఘాటు నిర్మాణం చేసుకోవాలని సూచించిన సర్వేనెంబర్ 495 లోని భూమిలో గతంలోనే రజకులు బాయి తొవ్వించుకొని బోరు వేసుకొని దోబి ఘాట్ నిర్మించుకొని అందులో చాకలి వృత్తి అయిన బట్టలు ఉతికే పని చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు ఆ భూమిపై కన్నేసిన భూ కబ్జాదారులు కొంతమంది వచ్చి అది పట్టా భూమి అని చెప్పుచున్నారు రజక సంఘం అందరూ కలిసి ఎమ్మార్వో కు అదేవిధంగా సర్వేరుకు జిల్లా సర్వేర్ కు అప్పిలు చేయక వాళ్ళు వచ్చి సర్వే చేసి ఇది ప్రభుత్వ భూమి అని ఈ ప్రభుత్వ భూమిలో చాకలి వాళ్ళకి కేటాయించిన దోబిసూట్ భూమి అని తేలువగా దాని చుట్టూ ఎమ్మార్వో జిల్లా సర్వేర్ తిరుమలగిరి మండల సర్వేర్ వారి సమక్షంలో కనీలు నాటుకొని అక్కడ మోడ్రన్ దోబీ ఘాటు ఏర్పాటు చేసుకుంటుండగా తెలంగాణ ఆత్మగౌరవమైన అదేవిధంగా చాకలి వారి ఆత్మగౌరవమైన భూ పోరాట స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని రజకులు తిరుమలగిరి మండల వివిధ సామాజిక కులాలు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకుంటుండగా దాన్ని కొంతమంది భూ అక్రమ దారులు కన్నెర్ర చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ తో మా విగ్రహాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు ఇది మా రజకుల ఆత్మగౌరవ సమస్యగా మేము తీసుకొని ఎన్ని కుట్రలు చేసినా ఆఖరికి మూకుమ్మడి అరెస్టు కైనా సిద్ధం అవసరమైతే మా రజకుల ఆత్మగౌరవం కోసం ఆమర నిరాహార దీక్ష చేసి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మేము ఏర్పాటు చేసుకుంటామని దీనికోసం ఎంత దూరమైన పోతామని ఈరోజు తిరుమలగిరి ఎస్సై మరియు పోలీస్ మమ్ములను ఎంతో ఇబ్బంది గురి చేస్తు గౌరవాన్ని దెబ్బతీస్తూ మమ్ములను మనోవేదన గురిచేస్తూ ఇక్కడ చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆపేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు . అవసరమైతే సూర్యాపేట జిల్లా ఎస్పీ కలెక్టర్ ఆర్డిఓ దృష్టికి తీసుకపోతాం మాకు జరుగుతున్న అన్యాయంపై చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటు జరుగుతున్న కుట్ర పై వెళ్లి అధికారులపై చర్యలు తీసుకోవడానికి అయినా మేము వెనకాడమని తెలియజేశారు .ఈ రజక సంఘం తో పాటు ఇక్కడికి వచ్చినటువంటి సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కన్వీనర్ కొత్తగట్టు మల్లన్న సామాజిక ఉద్యమ నాయకులు కందుకూరి ప్రవీణ్ మన ఆలోచన సాధన సమితి నాయకులు గిలకత్తుల రాము గౌడ్, మైనార్టీ సంఘం నాయకులు ఎండి కాసిం సంఘపాక రవి , ఎం సి బి ఐ యు డివిజన్ కార్యదర్శి నలుగురి రమేష్ అదేవిధంగా వివిధ సామాజిక ఉద్యమ నాయకులు అందరు కలిసి మాకు మద్దతు తెలపడం మాకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది కావున వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇకనైనా చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు పోలీసు వారు గాని మున్సిపాలిటీ వాళ్లు గాని రెవెన్యూ డిపార్ట్మెంట్ గాని వివిధ రాజకీయ పార్టీ నాయకులు సామాజిక ప్రజా సంఘాలు అందరూ కలిసి మద్దతు ఇచ్చి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేయాలని రజక సంఘం మండల అధ్యక్షులు పులిపామిడి సోమన్న కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల గౌరవ అధ్యక్షులు పులిమామిడి మల్లయ్య కార్యదర్శి పులిమామిడి బిక్షం మరియు ఆమనగంటి నరసయ్య ఆమనగంటి యాదగిరి ఆమనగంటి సోమయ్య పులిమామిడి వీరయ్య పులిమామిడి నరేష్ ఆమనగంటి లక్ష్మయ్య పులిమామిడి నాగరాజు పులిమామిడి యాకన్న అమనగంటి వెంకటేష్ దామెర నరేష్ ఆమనగంటి సత్యం పులిమామిడి పరశురాములు వడ్లకొండ గంగాధర్ సులుగునూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.