క్రీడాలతో సంపూర్ణ ఆరోగ్యం సూర్యాపేట పట్టణ సీఐ వెంకటయ్య

Jan 4, 2026 - 17:12
Jan 4, 2026 - 18:27
 0  19

తెలంగాణ వార్త సూర్యాపేట 4-01-2026:క్రీడాలతో సంపూర్ణ ఆరోగ్యమని పట్టణ సీఐ వెంకటయ్య అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం 19వ వార్డు అంబేద్కర్ నగర్ గ్రౌడ్లో తగ్స్ ఆఫ్ బిఎస్ఎన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూర్యాపేట జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కు ముఖ్యఅతిధిగా విచ్చేసి ప్రారంభించి మాట్లాడారు.

 ఈ సందర్భంగా ఇరు వర్గాల టీం లకు శుబాకాంక్షలు తేలియజేశారు. యువకులతో పట్టణ సీఐ వెంకటయ్య క్రికెట్‌ ఆడి ఉత్సాహపరిచారు.రెండు నెలల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తుందన్నారు.యువత చెడు అలవాట్లకు బారిన పడకుండా క్రీడలు ఆడడంతో శారీరకంగా మానసికంగా ధృడపడి కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందాలని తెలిపారు.క్రీడల వల్ల స్నేహ సంబంధాలు పెరుగుతాయని, ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిపోయినవారు నిరుత్సాహపడకుండా మళ్లీ గెలిచేందుకు కృషి చేయాలన్నారు.ఈ టోర్నమెంట్‌లో 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు మొరిగాల ఉపేందర్ గౌడ్ ఆర్ధిక సాకారంతో మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 15,000,మూడవ బహుమతి 10,000 రూపాయల నగదు బహుమతులను ప్రకటించారు.ఈ టోర్నమెంట్ 04వ తేదీ నుండి13వ తేదీ వరకు జరగనుంది.

బహుమతులు చివరి రోజున అందించబడతాయి.ఈ కార్యక్రమంలో మాడుగుల నవీన్, అంగిడి ఉపేందర్,ఎర్ర మాధవరెడ్డి, పుల్లయ్య, థక్స్ ఆఫ్ బి ఎస్ ఎన్ యూత్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు రవితేజ, నవీన్, శాంతి వర్ధన్, ఖదీర్, భార్గవ్, మనీ, రాహుల్, రాజు, రాజేష్, దీక్షిత్, భారత్, నితిన్, అరుణ్, శరత్, రణధీర్ తదితరులు పాల్గొన్నారు.

Santosh chakravarthy తెలంగాణ వార్త సీనియర్ జర్నలిస్టు 8500686136