హెల్మెట్ ధరిస్తేనే పెట్రోలు పోయాలి : ఎస్సై వెంకట్ రెడ్డి

Jan 4, 2026 - 21:13
 0  110
హెల్మెట్ ధరిస్తేనే పెట్రోలు పోయాలి : ఎస్సై వెంకట్ రెడ్డి

  తిరుమలగిరి 05 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

  రోడ్డు భద్రత మహోత్సవాలలో భాగంగా, వాహనదారులు హెల్మెట్ ధరించే విధంగా కఠిన నిబంధనలు  ఉన్నాయని తిరుమలగిరి ఎస్సై వెంకట్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల అనుసారం మండల పరిధిలోని పెట్రోల్ బంకు ఉన్నటువంటి యజమానులతో సమావేశం నిర్వహించి, వాహనదారులు హెల్మెట్ ధరించినట్లయితేనే పెట్రోల్ పోసే విధంగా మరియు ప్లాస్టిక్ బాటిల్ లో పెట్రోల్ పోయకుండా వారికి సూచించడం జరిగింది మండల పరిధిలో వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించి రోడ్లపైకి రావాలని, హెల్మెట్ లేకుండా రోడ్డుపైకి వచ్చి వాహనాలు నడిపినట్లు అయితే వారి పైన కఠినమైన చర్యలు ఉంటాయని తెలిపినారు..... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి