ఎలక్షన్ కోడ్ లో గ్రామపంచాయతీ సంతను వేలం వేసిన
పంచాయతీ సెక్రెటరీ.. భీమ్ రెడ్డి
తుంగతుర్తి, మార్చి 26 తెలంగాణవార్త ప్రతినిధి:- తుంగతుర్తి పట్టణంలోని గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామంలోని సంత వేలంపాటను వేయడం జరిగిందన్నారు జిల్లా అధికారి డిపిఓఆర్ సురేష్ కుమార్ ఆదేశాల మేరకు వేలంపాటను ప్రారంభించారు ఈ సంతకు పలు గ్రామాల మండలాల ప్రజలు వేలంపాటలో డిపాజిట్ చేసి పాటలో పాల్గొన్నారు గత సంవత్సరం ఆరు లక్షల 50 వేలకు పాట పాడగా ఈ సంవత్సరం ఏడు లక్షల 50 వేలకు పాట రావడం జరిగింది అందులో సొంత వేలం పాట వేయడానికి పాట పాడడానికి వచ్చిన సభ్యులందరూ గ్రామపంచాయతీ సిబ్బంది ద్వారా సంతకాలు చేసి సంత వేలంపాట అయినట్లుగా నిర్ధారణ చేసినారు.
ఆ తదుపరి సాయంత్రం నాలుగు గంటలకు కొంతమంది గ్రామస్తులు జిల్లా అధికారులను సంత వేలంపాట ఎలక్షన్ కోడ్ లో ఎలా జరుగుతుందని అడగటంతో ఈరోజు వేలంపాటను వాయిదా వేయడం జరిగిందని జిల్లా అధికారి తెలపడంతో పాటకు వచ్చిన పలు గ్రామాల ప్రజలు కంగుతినారు పలు గ్రామాల ప్రజలు మాకు న్యాయం చేయాలని ఎలక్షన్ కోడ్ ఉండగా వేలంపాటను ఎలా పెట్టారు.
మా తుంగతుర్తి గ్రామంలో కూడా డబ్బు చాటింగ్ చేయకుండా పేపర్ స్టేట్మెంట్ ఇవ్వకుండా వేలంపాటను వేయడం ఇది అన్యాయమని పలు గ్రామాల ప్రజలు గగోలు పెడుతున్నారు ఎవరికి తెలవకుండా కొంతమంది వ్యక్తులతో ఈ మంతనాలు జరుపుకొని వేలంపాటను చేసినట్లుగా ప్రజలు దృవీకరిస్తున్నారు తక్షణమే మండల జిల్లా అధికారులపై చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు...